అక్రమ నియామకాలు రద్దు చేయండి.. ఫిజిక్స్ రీసెర్చ్ స్కాలర్ నిరాహార దీక్ష

దిశ, కామారెడ్డి: తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్‌లోని ఫిజిక్స్ విభాగంలో అక్రమ నియామకాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ టీయూ ఫిజిక్స్ రీసెర్చ్ స్కాలర్ గణేష్ చేపట్టిన నిరాహార దీక్ష శుక్రవారం రెండోరోజుకు చేరింది. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ.. తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ ఫిజిక్స్ డిపార్ట్‌మెంట్‌లో 2019లో నోటిఫికేషన్ లేకుండా అక్రమ అకడమిక్ కన్సల్టెంట్ నియామకాలుగా చేపట్టి సరిత, దిలీప్, శ్రీమాతలను నియమించారన్నారు. ఆ నియామకానికి ఫిజిక్స్ డిపార్ట్మెంట్‌కి ఎలాంటి సంబంధం లేదని, […]

Update: 2021-12-03 06:48 GMT

దిశ, కామారెడ్డి: తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్‌లోని ఫిజిక్స్ విభాగంలో అక్రమ నియామకాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ టీయూ ఫిజిక్స్ రీసెర్చ్ స్కాలర్ గణేష్ చేపట్టిన నిరాహార దీక్ష శుక్రవారం రెండోరోజుకు చేరింది. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ.. తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ ఫిజిక్స్ డిపార్ట్‌మెంట్‌లో 2019లో నోటిఫికేషన్ లేకుండా అక్రమ అకడమిక్ కన్సల్టెంట్ నియామకాలుగా చేపట్టి సరిత, దిలీప్, శ్రీమాతలను నియమించారన్నారు. ఆ నియామకానికి ఫిజిక్స్ డిపార్ట్మెంట్‌కి ఎలాంటి సంబంధం లేదని, అయినా.. 2019 నుండి ఇప్పటివరకు వీసీ, రిజిస్ట్రార్లు వేతనాలు వేస్తునే ఉన్నారన్నారు.

దీంతో ఈ అక్రమ నియామకానికి వ్యతిరేకంగా తాను హైకోర్టులో కేసు వేశానని, దీనికి స్పందించిన కోర్టు వీసీ, రిజిస్ట్రార్లకు నోటీసులు కూడా పంపిందని, నోటీసులపై ఇప్పటివరకు సమాధానం ఇవ్వలేదని తెలిపారు. గత రెండేండ్లుగా సౌత్ క్యాంపస్‌లోని ఫిజిక్స్ డిపార్ట్మెంట్‌లో కొనసాగుతోన్న అక్రమ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాలు రద్దు చేయాలని ఉద్యమం చేపట్టారు. ఈ సందర్భంగా వారి నియామకాలు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే నిరాహార దీక్ష విరమించేది లేదని స్పష్టం చేశారు.

Tags:    

Similar News