మేమెలా ఆదేశిస్తాం : టీఎస్ హైకోర్టు

దిశ, న్యూస్‌బ్యూరో : రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పై జరుగుతున్న విచారణను తెలంగాణ హైకోర్టు నిరవధిక వాయిదా వేసింది. ‘సుప్రీంకోర్టు, ఎన్జీటీలో కేసు పెండింగ్‌లో ఉన్నందున తాము ఎలాంటి జోక్యం చేసుకోలేమని ప్రకటించింది. అసలు ‘ఏపీ ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఎలా ఆదేశించగలదు.. ఎన్జీటీ ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లలేదు. సుప్రీంకోర్టులో విచారణ పూర్తయ్యే వరకు నిరవధిక వాయిదా వేస్తున్నాం’ అని పిటిషనర్లకు హైకోర్టు తెలిపింది. సుప్రీంకోర్టులో కేసు విషయం తేలాక తమ దృష్టికి […]

Update: 2020-09-01 03:45 GMT

దిశ, న్యూస్‌బ్యూరో :

రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పై జరుగుతున్న విచారణను తెలంగాణ హైకోర్టు నిరవధిక వాయిదా వేసింది. ‘సుప్రీంకోర్టు, ఎన్జీటీలో కేసు పెండింగ్‌లో ఉన్నందున తాము ఎలాంటి జోక్యం చేసుకోలేమని ప్రకటించింది. అసలు ‘ఏపీ ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఎలా ఆదేశించగలదు.. ఎన్జీటీ ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లలేదు.

సుప్రీంకోర్టులో విచారణ పూర్తయ్యే వరకు నిరవధిక వాయిదా వేస్తున్నాం’ అని పిటిషనర్లకు హైకోర్టు తెలిపింది. సుప్రీంకోర్టులో కేసు విషయం తేలాక తమ దృష్టికి తీసుకురావచ్చని పిటిషనర్లకు హైకోర్టు సూచించింది.

Tags:    

Similar News