రేవంత్‌ను రాజకీయ సన్యాసం తీసుకోమనండి..

దిశ, అచ్చంపేట : ఒక జాతీయ పార్టీ.. తమ స్థాయిని కోల్పోయి బీజేపీ పార్టీకి అమ్ముడుపోయి నీచ రాజకీయాలు చేసినట్టు టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు చెన్నకేశవులు, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎడమ జగపతి రాజు విమర్శించారు. హుజురాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో 60వేల ఓట్లు సాధించుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఉప ఎన్నికలో మాత్రం 3వేల కూడా సాధింలేక పోయిందని విమర్శించారు. టీపీసీసీ ఛీప్ రేవంత్ రెడ్డి ఈటల రాజేందర్‌కు అమ్ముడుపోయి బీజేపీకి పట్టం కట్టారని ఆరోపించారు. […]

Update: 2021-11-03 22:32 GMT

దిశ, అచ్చంపేట : ఒక జాతీయ పార్టీ.. తమ స్థాయిని కోల్పోయి బీజేపీ పార్టీకి అమ్ముడుపోయి నీచ రాజకీయాలు చేసినట్టు టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు చెన్నకేశవులు, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎడమ జగపతి రాజు విమర్శించారు. హుజురాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో 60వేల ఓట్లు సాధించుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఉప ఎన్నికలో మాత్రం 3వేల కూడా సాధింలేక పోయిందని విమర్శించారు. టీపీసీసీ ఛీప్ రేవంత్ రెడ్డి ఈటల రాజేందర్‌కు అమ్ముడుపోయి బీజేపీకి పట్టం కట్టారని ఆరోపించారు. ఈ విషయం మరిచి సిగ్గు లేకుండా మా ఎమ్మెల్యే గువ్వల బాలరాజును రాజీనామా చేయమనడం వారి అవివేకం అని విమర్శించారు. గెలిచిన బీజేపీకి లేని ఆరాటం డిపాజిట్ కూడా దక్కకుండా ఓడిన మీకు ఎందుకు అని, ఇలా అడగడానికి కొంచమైనా సిగ్గు అనిపించడం లేదా అని ప్రశ్నించారు.

అంటే కాంగ్రెస్ పార్టీని బీజేపీలో కలిపారా.? లేక పొత్తు పెట్టుకున్నారా? అని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీకి 125 సంవత్సరాల చరిత్ర ఉందని చెప్పుకునే మీకు.. ఓట్లు ఎందుకు పడలేదో సమీక్షించుకోవాలని హితవు పలికారు. అంతేగానీ నోరు పారేసుకోవడం వలన ప్రయోజనమేమీలేదని అన్నారు. అదే మీ రేవంత్ రెడ్డి కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నాడు.. మరి తీసుకున్నాడా అని సూటిగా ప్రశ్నించారు. మీ నాయకున్ని రాజకీయ సన్యాసం తీసుకోమ్మనండి. అప్పుడు మా ఎమ్మెల్యే గురించి మాట్లాడండి అని అన్నారు.

అచ్చంపేట నియోజకవర్గం కోసం అహర్నిశలు కృషి చేస్తూ అభివృద్ధి బాటలో నడిపిస్తున్న ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై కాంగ్రెస్ నాయకులు విమర్శలు మానుకోవాలని హెచ్చరించారు. ఈ సమావేశంలో రాజారావు గౌడ్, తిరుపతయ్య, యూత్ అధ్యక్షుడు ఆలూరి కర్ణ బాబు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గోలి శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు దాసరి ఎల్లయ్య, ప్రధాన కార్యదర్శి అనిల్, టీఆర్ఎస్వీ మండల అధ్యక్షులు చందర్ నాయక్, గ్రామ అధ్యక్షులు బినమొని నారయ్య, సింగిల్ విండో డైరెక్టర్ రమేష్, మండల యూత్ అధ్యక్షులు శరత్ యాదవ్, ఎంపీటీసీలు సునీత శ్రీనివాసులు, ఎల్లమ్మ శ్రీనివాసులు, ముత్యాలు, ఎడమ వెంకటయ్య, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

 

Tags:    

Similar News