కృత్రిమంగా పండిస్తున్న 500 కేజీల మామిడి పండ్లు స్వాధీనం

చర్మ వ్యాధులు, శ్వాస కోస వ్యాధులు వ్యాపించే విధంగా మామిడి పండ్లను కృత్రిమంగా పండిస్తున్న ఇద్దరినీ సోమవారం హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీస్‌లు అరెస్ట్ చేశారు.

Update: 2024-04-29 16:03 GMT

దిశ, క్రైమ్ బ్యూరో: చర్మ వ్యాధులు, శ్వాస కోస వ్యాధులు వ్యాపించే విధంగా మామిడి పండ్లను కృత్రిమంగా పండిస్తున్న ఇద్దరినీ సోమవారం హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీస్‌లు అరెస్ట్ చేశారు. భారీగా కృతిమంగా పండించిన మామిడి పండ్లను పోలీస్‌లు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం హైదరాబాద్‌లోని పలు మామిడి పండ్లను నిల్వ ఉంచిన గోదాం లఫై టాస్క్ ఫోర్స్ పోలీస్ సోదాలు జరిపారు. ఎత్తనైల్ రసాయనాలతో మామిడి కాయలను తొందరగా పండేలా చేసి వాటిని సిటిలో పండ్ల దుకాణాలు, జ్యూస్ సెంటర్‌లకు సరఫరా చేస్తున్నట్లు పోలీస్‌లు గుర్తించారు. ఇలా రసాయనాలతో పండించిన మామిడి పండ్లు తినడం వల్ల శ్వాసకోశ సమస్యలు, చర్మ వ్యాధులు వస్తాయని, ఇంకా ఇతర అనారోగ్య రోగాలకు గురవుతారని పోలీస్ దర్యాప్తులో తేలింది. ఫుడ్ సెక్యూరిటీ, సేఫ్టీ అథారిటీ అఫ్ ఇండియా నిబంధనలకు విరుద్ధంగా గోదాం‌లను నిర్వహిస్తుండుడడంతో గోదాంలను నిర్వహిస్తున్న మహమ్మద్ మొయిజ్, మహమ్మద్ సాదిక్ లను అరెస్ట్ చేసి 500 కేజీల మామిడి పండ్లను పోలీస్‌లు స్వాధీనం చేసుకున్నారు.

Similar News