హోటల్ బంపర్ ఆఫర్.. రూ.400 వెజ్ తాలి కేవలం 5 పైసలకే! (వీడియో)
ఈ మధ్యకాలంలో షాపింగ్ మాల్స్‌లో ఖరీదైన దుస్తులకు భారీగా డిస్కౌంట్ ఇస్తున్నట్లు ప్రకటిస్తే... వాటికోసం వేల సంఖ్యలో జనాలు ఎగబడి కొన్న వీడియోలు చూసే ఉంటారు
దిశ, డైనమిక్ బ్యూరో : ఈ మధ్యకాలంలో షాపింగ్ మాల్స్‌లో ఖరీదైన దుస్తులకు భారీగా డిస్కౌంట్ ఇస్తున్నట్లు ప్రకటిస్తే... వాటికోసం వేల సంఖ్యలో జనాలు ఎగబడి కొన్న వీడియోలు చూసే ఉంటారు. అయితే, తాజాగా షాపింగ్ మాల్ ప్రకటన మాదిరిగానే ఓ హోటల్ కూడా ఖరీదైన ఫుడ్‌ను తక్కువ ధరకే పెడుతున్నట్లు ప్రకటించడంతో జనాలు హోటల్ ముందు బారులు తీరారు. వివరాల్లోకి వెళితే.. ఏపీలోని విజయవాడలో ఒక ప్రముఖ హోటల్లో రూ.400 విలువ గల వెజ్ తాలిని పాత 5 పైసల తీసుకొస్తే ఫ్రీగా పెడతామని ప్రకటించింది. దీంతో, ఉదయం 9 గంటల నుంచే జనం హోటల్ ముందు బారులు తీరారు. హోటల్లో గ్యాప్ లేకుండా జనాలు క్యూ కట్టారు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట చక్కర్లుకొడుతుంది. అయితే, ఇది విజయవాడ అని తెలిసింది కానీ, ఏ హోటల్ అనే వివరాలు మాత్రం తెలియలేదు.
Veg thali @ 5paisa
— Rakesh Reddy (@rakeshreddylive) December 2, 2022
విజయవాడలో ఒక ప్రముఖ హోటల్ లో రూ. 400 విలువగల వెజ్ తాలి పాత 5 పైసల కాయిన్ తీసుకొస్తే ఫ్రీ గా పెడతామని ఇచ్చిన ప్రకటనకి ఉదయం 9 గంటలనుంచే వెల్లువెత్తిన జనాలు…. pic.twitter.com/EBMpPfDwdK