మా టీచర్ క్రిమినల్.. ఆమెను కాల్చేయండి.. వైరల్‌గా మారిన స్టూడెంట్ ఆన్సర్ షీట్

ఈ మధ్య కాలంలో పరీక్షల్లో విద్యార్థులు రాసిన ఆన్సర్ షీట్స్ వైరల్ అవుతున్నాయి.

Update: 2024-05-03 14:08 GMT

దిశ, ఫీచర్స్: ఈ మధ్య కాలంలో పరీక్షల్లో విద్యార్థులు రాసిన ఆన్సర్ షీట్స్ వైరల్ అవుతున్నాయి. ఎగ్జామ్స్‌లో వారి సొంత ప్రతిభను చూపిస్తూ కొంత మంది విద్యార్థులు పరీక్షల్లో పాస్ అవుతుంటే.. మరికొందరూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఇందుకు సంబంధించిన ఆన్సర్ షీట్ నెట్టింట చక్కర్లు కొట్టడంతో నవ్వులు పూయిస్తున్నాయి. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటనే సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అదేంటంటే..!

ఇంగ్లీష్ పరీక్షకు ఓ విద్యార్థి వింత జావాబులతో అందరిని ఆశ్చర్యపరిచాడు. ఆ ఎగ్జామ్ పేపర్‌లో కొన్ని పదాలు ఇచ్చి వాటిని సరైన పదాలతో పూరించాలని ఉంది. ఈ మేరకు ఓ విద్యార్థి ‘టీచర్’ అనే పదానికి.. మై టీచర్ ఈజ్ ఏ క్రిమినల్ అని రాశాడు. తర్వాత పోలీస్ అనే పదానికి.. పోలీస్ నా టీచర్‌ను పట్టుకోండి అని.. అలాగే పైలెట్ అనే పదానికి.. పైలెట్, మా టీచర్‌పై మీ విమానాన్ని ల్యాండ్ చేయండి అని.. డాక్టర్ అని ఉన్న పదానికి.. మా టీచర్‌కు ఇన్‌జెక్షన్ చెయ్యాలని, డెస్ట్‌బిన్‌కు మా టీచర్ ఫేస్ డెస్ట్‌బిన్‌లా ఉంటుంది అంటూ టీచర్‌పై తనకున్న కోపం మొత్తాన్ని ఆన్సర్ రూపంలో తీర్చుకున్నాడు. దీంతో విద్యార్థి ఆన్సర్లు చూసి షాక్ అయిన టీచర్ వాటికి సంబంధించిన ఆన్సర్ షీట్‌ను ఫొటోలు తీసి సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్ అవుతుండగా.. ‘మీ టీచర్‌పై నీకు ఎందుకు అంత కోపం’ అని ‘పాపం టీచర్’ అంటూ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.

Similar News