'నా ప్రియమైన మొసలిని దొంగిలించారు 'దయచేసి ఎవరైనా వెతికి పెట్టండి..

జంతువులను ప్రేమించే వారు, వాటిని పెంచి సంరక్షించే వారు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు.

Update: 2024-05-05 10:33 GMT

దిశ, ఫీచర్స్ : జంతువులను ప్రేమించే వారు, వాటిని పెంచి సంరక్షించే వారు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. సాధారణంగా ప్రజలు కుక్కలు, పిల్లులను మాత్రమే పెంచుకుంటారు. అయితే కొందరు వ్యక్తులు సింహం, పులి, మొసలి, ఘరియాల్ వంటి ప్రమాదకరమైన జంతువులను కూడా పెంపుడు జంతువులుగా ఉంచుతారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ జంతువులు వారికి హాని చేయవు. ఇక ఆ జంతువులకు కాస్త అనారోగ్యం సంభవించినా వైద్యులకు చూపిస్తారు. అవి కొద్ది సేపు కంటికి కనిపంచకపోయినా తెగ కంగారు పడతారు. ఇప్పుడు అలాంటి ఒక సంఘటనే వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తాను ప్రాణంగా పెంచుకున్నా మొసలి తప్పింపోయిందని, ఎవరైనా కనుక్కొనే ప్రయత్నం చేయండని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఈ సంఘటన అమెరికాలోని పెన్సిల్వేనియాలో జరిగింది. పెన్సిల్వేనియాలో జోయ్ హానీ అనే వ్యక్తి తప్పిపోయిన తన పెంపుడు మొసలి కోసం వెతుకుతున్నాడు. కొన్నేండ్ల నుంచి డిప్రెషన్ లో ఉన్న తాను ఉపశమనం పొందేందుకు మొసలి తనకు సహాయపడిందని అతను పేర్కొన్నాడు. జోయి తన ఎలిగేటర్‌తో విహారయాత్రకు జార్జియాకు వెళ్లాడని, అది అక్కడి నుంచి తప్పిపోయిందని తెలిపారు. ఆ తర్వాత చాలా రోజులుగా దాని కోసం వెతుకుతున్నానని జోయి వెల్లడించాడు. జో సోషల్ మీడియాలో చాలా పాపులర్ అని, తన మొసలి చిత్రాలను, వీడియోలను ఎల్లప్పుడూ షేర్ చేస్తూ ఉంటాడని తెలుపుతున్నారు.

ఇంటి బయట దొంగతనం..

నివేదికల ప్రకారం జోయి జార్జియాలోని సవన్నాకు దక్షిణాన ఉన్న ఓడరేవు నగరమైన బ్రున్స్‌విక్‌కు విహారయాత్రకు వెళ్లాడు. తన మొసలిని రాత్రి పూట ఉంచిన ఎన్ క్లోజర్ నుంచి ఎవరో దొంగిలించారని అనుమానం వ్యక్తం చేశారు. తన ఇంటి బయట ఉన్న మొసలిని ఎవరో చూసి అధికారులకు సమాచారం అందించారని, ఆ తర్వాత దాన్ని పట్టుకుని అడవిలోకి వదిలేసి ఉంటారని అంటున్నారు.

డిప్రెషన్ నుంచి బయటపడేందుకు సహకరించింది..

జోయి తాను ఏడుస్తున్న వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ టిక్‌టాక్‌లో పంచుకున్నాడు. అందులో అతను మొత్తం సంఘటనను ఏమి జరిగిందో వివరించాడు. ఆ వీడియోలో 'నా బిడ్డను తిరిగి తీసుకురావడానికి నాకు అన్ని విధాలా సహాయం కావాలి' అని చెప్పాడు. మీ సహాయం మాకు కావాలి అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జో ప్రకారం, అతను 2015లో 14 నెలల వయసులో ఫ్లోరిడాలో ఎలిగేటర్‌ను తీసుకున్నాడు. తన స్నేహితుల్లో ఒకరి మరణంతో తాను డిప్రెషన్‌లోకి వెళ్లానని, అయితే డిప్రెషన్ నుంచి బయటపడేందుకు మొసలి తనకు సహాయపడిందని చెప్పాడు. అందుకే దాని పై విపరీతమైన అభిమానం పెంచుకున్నాడు.

https://www.reddit.com/r/marvelstudios/comments/1ci2h6k/alligator_loki_aka_wally_the_emotional_support/


Read More...

అత్యంత ప్రమాదకరమైన పని చేస్తున్న మహిళ.. నెలకు రూ. 5 లక్షల వేతనం.. 


Tags:    

Similar News