షాకింగ్ వీడియో చూస్తే షేక్ అవ్వాల్సిందే.. ముగ్గురు బాలికలపైకి దూసుకొచ్చిన రెండు ఎద్దులు (వీడియో)

నిత్యం సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు సందడి చేస్తుంటాయి.

Update: 2024-05-18 13:57 GMT

దిశ, ఫీచర్స్: నిత్యం సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు సందడి చేస్తుంటాయి. కొన్ని వీడియోలు చూస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అదే మరికొన్ని మాత్రం భయందోళనకు గురి చేస్తాయి. అంతే కాకుండా కొన్ని వీడియోలు చావు భయాన్ని రుచి చూపిస్తాయి. ఈ కోవకు చెందిన వీడియోనే ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. సామాజిక మాధ్యామాల్లో వైరల్ అవుతున్న వీడియో మేరకు ‘ఓ ముగ్గురు బాలికలు కూర్చుని ఉన్నారు. ఇంతలో రెండు పెద్ద ఎద్దులు అటూగా దూసుకొచ్చాయి. అందులో ఒక అమ్మాయి తప్పించుకోగా.. మరో బాలిక మాత్రం పక్కనే ఉన్న షాప్ అద్దాలకు గుద్దుకుంది. ఇక మూడో అమ్మాయి పెద్ద ఎద్దు కాళ్ల కింద పడిపోయింది. దీంతో ఆ ఎద్దు ఆమెను తొక్కేసింది. దీనికి గమనించిన చుట్టుపక్కల వాళ్లు సమయానికి స్పందించి ఆ అమ్మాయిని కాపాడారు’. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో.. చావు అంచుల వరకు వెళ్లి వచ్చారని.. అదృష్టవంతులు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Similar News