భారత్‌లో కరోనా ఉగ్రరూపం

దిశ, వెబ్ డెస్క్: భారత్ లో కరోనా వైరస్ రోజురోజుకు ఉగ్రరూపం దాల్చుతోంది. దాని కోరలతో ప్రజలను గజగజ వణికిస్తోంది. రోజురోజుకు పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. పెద్ద ఎత్తున ప్రజలు మృతిచెందుతున్నారు. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకారం తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో 27,114 కొత్త కేసులు నమోదయ్యాయి. 519 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య దేశవ్యాప్తంగా 8,20,916కు చేరుకుంది. ఇందులో 2,83,407 మంది ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. […]

Update: 2020-07-10 23:24 GMT

దిశ, వెబ్ డెస్క్: భారత్ లో కరోనా వైరస్ రోజురోజుకు ఉగ్రరూపం దాల్చుతోంది. దాని కోరలతో ప్రజలను గజగజ వణికిస్తోంది. రోజురోజుకు పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. పెద్ద ఎత్తున ప్రజలు మృతిచెందుతున్నారు. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకారం తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో 27,114 కొత్త కేసులు నమోదయ్యాయి. 519 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య దేశవ్యాప్తంగా 8,20,916కు చేరుకుంది. ఇందులో 2,83,407 మంది ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. 5,15,368 మంది బాధితులు కరోనా బారిన పడి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశార్జ్ అయ్యారు. అదేవిధంగా కరోనా సోకి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మృతిచెందిన వారి సంఖ్య 22,123 కు పెరిగింది.

Tags:    

Similar News