ఔత్సాహిక టెక్కీలకు టీటా ఆహ్వానం

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ తమతో కలిసి న‌డిచే వారి కోసం నూతన స‌భ్యత్వ నమోదుకు ఆహ్వానం పలికింది. టీటా గ్లోబ‌ల్ క‌మిటీ- 2020 కాల‌ప‌రిమితి డిసెంబ‌ర్ 31తో ముగియ‌నున్న నేప‌థ్యంలో కొత్తగా సభ్యులను చేర్చుకోనున్నారు. ఐటీ ఉద్యోగులు, కార్పొరేట్ మెంబ‌ర్‌షిప్, ఎన్నారైలు, విద్యార్థులు, అసోసియేట్ స‌భ్యులు, ఐటీ ఫ్యాక‌ల్టీ, ప్రభుత్వ రంగం నుంచి ఐటీ విభాగంలో ఉన్న వారంతా సభ్యులుగా చేరవచ్చునని టీటా గ్లోబల్​ప్రెసిడెంట్ సందీప్ కుమార్ […]

Update: 2020-12-15 12:04 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ తమతో కలిసి న‌డిచే వారి కోసం నూతన స‌భ్యత్వ నమోదుకు ఆహ్వానం పలికింది. టీటా గ్లోబ‌ల్ క‌మిటీ- 2020 కాల‌ప‌రిమితి డిసెంబ‌ర్ 31తో ముగియ‌నున్న నేప‌థ్యంలో కొత్తగా సభ్యులను చేర్చుకోనున్నారు. ఐటీ ఉద్యోగులు, కార్పొరేట్ మెంబ‌ర్‌షిప్, ఎన్నారైలు, విద్యార్థులు, అసోసియేట్ స‌భ్యులు, ఐటీ ఫ్యాక‌ల్టీ, ప్రభుత్వ రంగం నుంచి ఐటీ విభాగంలో ఉన్న వారంతా సభ్యులుగా చేరవచ్చునని టీటా గ్లోబల్​ప్రెసిడెంట్ సందీప్ కుమార్ మక్తాల మంగళవారం ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క‌మిటీలు, జిల్లా క‌మిటీల‌కు సైతం ఈ అంశాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని ఔత్సాహికుల‌కు సభ్యత్వ విష‌యంలో స‌హాయ స‌హ‌కారాలు అందించాల‌న్నారు. ఔత్సాహికులు bit.ly/joinTITA లింక్ ద్వారా స‌భ్యులుగా చేర‌వ‌చ్చు. నామినేష‌న్లు పంపేవారు telanganait@gmail.com ఈ మెయిల్‌కు ప్రతిపాదించొచ్చునన్నారు. సాంకేతిక అక్షరాస్యత కోసం గ్రామాల‌ను ద‌త్తత తీసుకోవ‌డం, న‌గ‌దు ర‌హిత లావాదేవీల‌ను ప్రోత్సహించ‌డం కోసం డిజిథాన్ వంటి కార్యక్రమాలను చేపట్టినట్లు వివరించారు. టీటా కృషిని చూసి దేశ‌ విదేశాల్లో సైతం వివిధ శాఖ‌లు ఏర్పాటు అయ్యాయ‌న్నారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News