BREAKING: ముగిసిన కేబినెట్ భేటీ.. కాంగ్రెస్ సర్కార్ మరో కీలక నిర్ణయం

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. సచివాలయంలో ఇవాళ మధ్యాహ్నం మొదలైన మంత్రి మండలి

Update: 2024-05-20 13:51 GMT

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. సచివాలయంలో ఇవాళ మధ్యాహ్నం మొదలైన మంత్రి మండలి సమావేశం దాదాపు మూడున్నర గంటల పాటు సాగింది. కేంద్ర ఎన్నికల సంఘం కేబినెట్ భేటీకి అంక్షలతో కూడిన అనుమతి ఇవ్వడంతో కేవలం అత్యవసర అంశాలపై మాత్రమే ఈ భేటీలో చర్చించారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడంతో పాటు ఈ వేడుకలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ఆహ్వానించాలని మంత్రి మండలి నిర్ణయించింది. ధాన్యం కొనుగోళ్లపై సీరియస్‌గా డిస్కస్ చేసిన కేబినెట్.. వరి కొనుగోళ్ల బాధ్యత పూర్తిగా కలెక్టర్లకు అప్పగించడంతో పాటు, ఏ రైతుకు నష్టం జరగకుండా చివరి గింజ వరకు కొనాలని అధికారులను ఆదేశించింది.

ఇక, పార్లమెంట్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో రైతులకు రూ.2 లక్షల రైతు రుణమాఫీ, రాష్ట్ర విజభన అంశాలపై కేబినెట్ భేటీలో చర్చించవద్దని ఈసీ ఆదేశించడంతో.. దీనిపై డిస్కషన్ జరగలేదు. కాగా, శనివారమే తెలంగాణ కేబినెట్ భేటీ జరగాల్సి ఉండగా.. ఈసీ అనుమతి ఇవ్వకపోవడంతో చివరి నిమిషంలో సమావేశం వాయిదా పడింది. మంత్రి మండలి సమావేశానికి అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఈసీకి రిక్వెస్ట్  చేయగా.. ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించింది. కేబినెట్ భేటీకి షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. 


Read More...

BREAKING: ముగిసిన కేబినెట్ భేటీ.. కాంగ్రెస్ సర్కార్ మరో కీలక నిర్ణయం 

Similar News