నిర్మల్‌లో మరో మూడు పాజిటివ్ కేసులు

దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలో కొత్తగా మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ వెల్లడించారు. సోమవారం 40శాంపిళ్లను పరీక్షించగా ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపారు. బాధితుల్లో ఒకరు జిల్లా కేంద్రంలోని గుల్జార్ మార్కెట్ ప్రాంతానికి చెందినవారు కాగా, ఒకరు భైంసా పట్టణంలోని వ్యక్తి, మరొకరు నర్సాపూర్ మండలం చాక్ పల్లి గ్రామస్తుడని పేర్కొన్నారు. దీంతో నిర్మల్ జిల్లాలో మొత్తం నలుగురు వ్యక్తులు కరోనా బారిన పడినట్టు కలెక్టర్ వివరించారు. […]

Update: 2020-04-06 10:21 GMT

దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలో కొత్తగా మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ వెల్లడించారు. సోమవారం 40శాంపిళ్లను పరీక్షించగా ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపారు. బాధితుల్లో ఒకరు జిల్లా కేంద్రంలోని గుల్జార్ మార్కెట్ ప్రాంతానికి చెందినవారు కాగా, ఒకరు భైంసా పట్టణంలోని వ్యక్తి, మరొకరు నర్సాపూర్ మండలం చాక్ పల్లి గ్రామస్తుడని పేర్కొన్నారు. దీంతో నిర్మల్ జిల్లాలో మొత్తం నలుగురు వ్యక్తులు కరోనా బారిన పడినట్టు కలెక్టర్ వివరించారు. వీరిని హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించామని జిల్లా ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దేవేందర్ రెడ్డి తెలిపారు. కాగా, జిల్లాలో కరోనా బాధితులందరికీ మర్కజ్ లింకు ఉండడం గమనార్హం.

tags: corona, virus, positive cases, corona in nirmal, collector musharraf farooq, hospital superintendent devender reddy, gandhi hospital, markaz,

Tags:    

Similar News