కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం

దిశ, వెబ్‌డెస్క్: కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బంగారం, డాలర్‌ స్మగ్లింగ్‌ కేసులను విచారిస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థలపై న్యాయ విచారణకు కేరళ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. స్మగ్లింగ్ కేసులను విచారిస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సహా కేంద్ర దర్యాప్తు సంస్థలపై న్యాయ విచారణకు సీఎం విజయన్ సర్కార్ సిఫారసు చేయనుంది. శుక్రవారం జరిగిన ప్రత్యేక మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈసీ అనుమతి తర్వాతే.. బంగారం, డాలర్ అక్రమ రవాణా కేసులో కేంద్ర […]

Update: 2021-03-26 20:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బంగారం, డాలర్‌ స్మగ్లింగ్‌ కేసులను విచారిస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థలపై న్యాయ విచారణకు కేరళ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. స్మగ్లింగ్ కేసులను విచారిస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సహా కేంద్ర దర్యాప్తు సంస్థలపై న్యాయ విచారణకు సీఎం విజయన్ సర్కార్ సిఫారసు చేయనుంది. శుక్రవారం జరిగిన ప్రత్యేక మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈసీ అనుమతి తర్వాతే.. బంగారం, డాలర్ అక్రమ రవాణా కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ పట్టాలు తప్పిందనీ, అందుకే ఆ సంస్థలపై న్యాయ విచారణకు సిఫారసు చేయాలని నిర్ణయించామని.. కేరళ మంత్రివర్గం వెల్లడించింది. కాగా, గోల్డ్ స్కాం సహా పలు కేసులతో సీఎం విజయన్‌కు సంబంధాలున్నాయని ఈడీ ఆరోపించిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News