నా దేశ గొప్పతనం..!

అహా ఒహో అని ఎంతజెప్పుకున్నా ఒడువని కతే నా దేశ గొప్పతనం. గాంధీ పుట్టిన దేశమని గర్వంగా చెప్పుకున్నా గాడ్సేలే పాలకులై గాయిగాయి చేయబట్టే. భూతల సొర్గం నా దేశమని సంకలు గుద్దుకొంటూ సంగసంగ ఎగిరినా పెట్టుబడి భూతాలే భూమాతను చెరబట్టి భూమి పుత్రులనే బంధీలను చేయబట్టే. దేశ సరిహద్దుల్లో ఉండాల్సిన నా దేశ సైన్యం దేశం నడి మధ్యలకచ్చి కరాళ నృత్యం చేస్తు రోజుకో పదిమంది పాణాలను హరించబట్టే ఎంతనీ చెప్పను నాదేశ గొప్పతనం ఏమని […]

Update: 2020-09-07 05:51 GMT

అహా ఒహో అని
ఎంతజెప్పుకున్నా
ఒడువని కతే నా దేశ
గొప్పతనం.
గాంధీ పుట్టిన దేశమని
గర్వంగా చెప్పుకున్నా
గాడ్సేలే పాలకులై
గాయిగాయి చేయబట్టే.

భూతల సొర్గం
నా దేశమని సంకలు గుద్దుకొంటూ
సంగసంగ ఎగిరినా
పెట్టుబడి భూతాలే
భూమాతను చెరబట్టి
భూమి పుత్రులనే
బంధీలను చేయబట్టే.

దేశ సరిహద్దుల్లో ఉండాల్సిన
నా దేశ సైన్యం
దేశం నడి మధ్యలకచ్చి
కరాళ నృత్యం చేస్తు
రోజుకో పదిమంది
పాణాలను హరించబట్టే

ఎంతనీ చెప్పను
నాదేశ గొప్పతనం
ఏమని పాడను
నా దేశ ఔన్నత్యం

విదేశీ తొత్తులైన
నా పాలకులు
నాదేశ అంగంగాన్నీ
విపణీ వీధిలో పెట్టి
భక్షించడానికి వీక్షించబట్టె

సార్వభౌమాధికారాన్ని
సాగిలబడగొట్టి
బహుళ జాతి సంస్థలబాంచెన గిరీ చేస్తున్న
నా దేశ పాలకుల పనితనం
ఎంతజెప్పినా తక్కువే
నా దేశ ప్రజలకు ఎన్నటికీ
ఒడువనీ దుఃఖమే.

అందుకే మన వెన్నెముకలను
నిటారుగా సరిచేసుకుందాం
నిలబడి కలబడి మనది మనం
కాపాడుకుందాం.

—నల్లెల్ల రాజయ్య.వరంగల్, సెల్ నం.9989 415571

Tags:    

Similar News