గాన గంధర్వునికి పద్మ విభూషణ్

దిశ, వెబ్‌డెస్క్: ప్రతి సంవత్సరం భారత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించే పద్మ అవార్డులను సోమవారం ప్రకటించింది. అందులో 102 మందికి పద్మశ్రీ, పది మందికి పద్మ భూషణ్, ఏడుగురికి పద్మ విభూషణ్ అవార్డులను భారత ప్రభుత్వం వెలువడించింది. అందులో భారతరత్న తర్వాత అతి పెద్ద గౌరవంగా భావించే పద్మ విభూషణ్ పురస్కారం గాన గంధర్వుడు దివంగత ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంను వరించింది. అయితే ఎస్పీబీకి ఇంతటి మహత్తర గౌరవం లభించడం పట్ల సినీ ఇండస్ట్రీ పెద్దలు […]

Update: 2021-01-25 10:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రతి సంవత్సరం భారత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించే పద్మ అవార్డులను సోమవారం ప్రకటించింది. అందులో 102 మందికి పద్మశ్రీ, పది మందికి పద్మ భూషణ్, ఏడుగురికి పద్మ విభూషణ్ అవార్డులను భారత ప్రభుత్వం వెలువడించింది. అందులో భారతరత్న తర్వాత అతి పెద్ద గౌరవంగా భావించే పద్మ విభూషణ్ పురస్కారం గాన గంధర్వుడు దివంగత ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంను వరించింది. అయితే ఎస్పీబీకి ఇంతటి మహత్తర గౌరవం లభించడం పట్ల సినీ ఇండస్ట్రీ పెద్దలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ప్రతి సంవత్సరం వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన భారత పౌరులను భారత రాష్ట్రపతి ఈ పతకాన్ని అందజేసి గౌరవిస్తున్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News