రాహుల్ గాంధీపై పాక్ మాజీ మంత్రి ప్రశంసలు.. బీజేపీ భగ్గు

దిశ, నేషనల్ బ్యూరో : పాకిస్తాన్ మాజీ మంత్రి ఫవాద్ హుస్సేన్ సోషల్ మీడియా వేదికగా రాహుల్ గాంధీని పొగుడుతూ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధానికి దారితీశాయి.

Update: 2024-05-02 16:26 GMT

దిశ, నేషనల్ బ్యూరో : పాకిస్తాన్ మాజీ మంత్రి ఫవాద్ హుస్సేన్ సోషల్ మీడియా వేదికగా రాహుల్ గాంధీని పొగుడుతూ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధానికి దారితీశాయి. రాహుల్ గాంధీ ప్రసంగానికి సంబంధించిన ఒక వీడియోను ఫవాద్ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో పోస్ట్ చేస్తూ.. ‘‘రాహుల్ గాంధీ అన్ ఫైర్’’ అని కామెంట్ చేశారు. ఈ పోస్టుపై బీజేపీ భగ్గుమంది.

పాకిస్తాన్‌తో కాంగ్రెస్‌కు ఉన్న సంబంధమేంటి అని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వీయా ప్రశ్నించారు. ‘‘ఇమ్రాన్ ఖాన్ క్యాబినెట్‌లో సమాచార, ప్రసార శాఖ మంత్రిగా పనిచేసిన ఫవాద్ హుస్సేన్ రాహుల్ గాంధీని ప్రమోట్ చేస్తున్నారు. పాకిస్తాన్‌ ఎన్నికల్లో పోటీ చేయాలనే ప్లాన్ ఏదైనా కాంగ్రెస్ పార్టీకి ఉందా ?’’ అని అమిత్ మాల్వీయా ప్రశ్నను సంధించారు. ముస్లిం లీగ్ ఆనవాళ్లున్న మేనిఫెస్టోను కలిగిన పార్టీకి పాకిస్తాన్ నుంచి మద్దతు లభిస్తోందని మండిపడ్డారు. పాకిస్తాన్‌తో కాంగ్రెస్ స్పష్టమైన పొత్తును కలిగి ఉందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఆరోపించారు. ‘‘కాంగ్రెస్ తన అభిమాన పార్టీ అని గతంలో ఉగ్రవాది హఫీజ్ సయీద్ చెప్పారు. మణి శంకర్ అయ్యర్ ప్రధాని మోడీని నిలదీయడానికి మద్దతు కోసం పాకిస్తాన్‌కు వెళ్లారు. ఇటీవల కాంగ్రెస్ నాయకులు పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు చేశారు. బీకే హరిప్రసాద్ ఏకంగా బహిరంగంగానే పాక్‌కు మద్దతుగా మాట్లాడటం గుర్తుంది’’ అని షెహజాద్ పూనావాలా వ్యాఖ్యానించారు.


Tags:    

Similar News