టీఆర్ఎస్ పార్టీ మీటింగ్‌లో అపశృతి... ఆ మహిళ మృతి

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గౌతమి నగర్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ రామగుండం నియోజకవర్గ

Update: 2022-03-24 10:40 GMT

దిశ,గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గౌతమి నగర్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ రామగుండం నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో అపశృతి చోటు చేసుకుంది. ఫంక్షన్ హాల్‌లో మీటింగ్ జరుగుతున్న క్రమంలో 31వ డివిజన్ మెదర్ బస్తీకి చెందిన సాఫీయా అనే మహిళ అక్కడికక్కడే కుప్పకూలి పోయింది. దీంతో కార్పొరేటర్ అడ్డాల రామస్వామి శారద నగర్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. కాగా ఆమె మృతికి కారణాలు తెలియరాలేదు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News