ఎవరు గోదావరి స్నానానికి వెళ్లొద్దు: ఏఎస్పీ శబరిష్

దిశ, మణుగూరు : గోదావరి ప్రవాహం రెండు రోజుల నుంచి ఉధృతంగా ప్రవహిస్తున్నందున యువత latest telugu news..

Update: 2022-03-17 15:35 GMT

దిశ, మణుగూరు : గోదావరి ప్రవాహం రెండు రోజుల నుంచి ఉధృతంగా ప్రవహిస్తున్నందున యువత గోదావరి స్నానానికి వెళ్లవద్దని మణుగూరు సబ్ డివిజన్ ఏఎస్పీ డాక్టర్ శబరిష్ సూచించారు. గురువారం మండలంలోని ఏఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ముందుగా పట్టణ ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. హొలీ రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవాలన్నారు.

ముఖ్యంగా యువత గోదావరి స్నానానికి వెళ్ళవద్దని ఆయన కోరారు. రెండు రోజుల నుంచి గోదావరి ఉధృతంగా ప్రవహిస్తునందున గత రెండు నెలల్లో ముగ్గురు యువకులు మునిగి చనిపోవడం జరిగిందన్నారు. పండుగ రోజున ఎవరైనా ప్రజలకు ఇబ్బంది కలిగే పనులు చేస్తే.. వారిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ముత్యం రమేష్, ఎస్సైలు నరేష్, బట్ట పురుషోత్తం, ఏఎస్సై నాగేశ్వరావు సిబ్బంది పాల్గొన్నారు.

Tags:    

Similar News