పొట్టు పొట్టు కొట్టుకున్న దంపతులు.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ (వీడియో)

దిశ, వెబ్ డెస్క్: అప్పుడప్పుడు నెట్టింట భిన్నమైన వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే....Viral Video: Couple attacking each other on ship in new york

Update: 2022-07-05 02:15 GMT

దిశ, వెబ్ డెస్క్: అప్పుడప్పుడు నెట్టింట భిన్నమైన వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే, తాజాగా కూడా మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దంపతులు పొట్టు పొట్టు కొట్టుకున్న దృశ్యాన్ని మనం ఆ వీడియోలో చూడొచ్చు. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. న్యూయార్క్ లోని క్రూయిజ్ షిప్ లో మంగళవారం ఓ ఘటన చోటు చేసుకుంది. అందులో నిర్వహించిన పార్టీలో 70 వరకు ప్రేమజంటలు, దంపతులు పాల్గొన్నాయి. వీళ్లంతా కొద్దిసేపు మందు కొడుతూ డ్యాన్స్ లు చేస్తూ తెగ ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత పొట్టు పొట్టు కొట్టుకున్నారు. ఏమైందో తెలీదు గానీ ఒకరిపై ఒకరు తీవ్రంగా దాడి చేసుకున్నారు. అక్కడే ఉన్న వ్యక్తులు ఇదంతా కూడా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో వైరల్ అవుతోంది. 

Similar News