పేషెంట్ శరీర కదలికల కోసం ముగ్గురు నర్సులు ఏం చేశారంటే..

మందులే కాదు.. ప్రకృతి వైద్యం కూడా అవసరమేనని గుర్తిస్తున్నారు నేటి తరం వైద్యులు.

Update: 2022-04-03 08:14 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్: మందులే కాదు.. ప్రకృతి వైద్యం కూడా అవసరమేనని గుర్తిస్తున్నారు నేటి తరం వైద్యులు. సహజ సిద్ధంగా పేషెంట్‌లో కదలికలు తీసుకు వచ్చేందుకు సినిమా పాటలు వేసి డ్యాన్సులు చేస్తూ రోగుల్లో మానసిక స్థిరత్వం కల్పించడంతో పాటు శరీరంలో కదలికలను వచ్చేందుకు వారు చేస్తున్న ప్రయత్నమే ఇది. కరీంనగర్‌లోని మీనాక్షి హాస్పిటల్ లోని నర్సులు వినూత్నంగా డ్యాన్సులు చేస్తూ పేషెంట్ నుండి స్పందన వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గొల్లపల్లికి చెందిన శ్రీనివాస్ లివర్ సంబంధిత వ్యాధితో బ్రెయిన్ కు ఆక్సిజన్ అందకపోవడంతో తీవ్ర అస్వస్థకు గురయ్యాడు. పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన అతన్ని 25 రోజుల క్రితం మీనాక్షి సూపర్ స్పెషాలిటీలో చేర్పించారు. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న శ్రీనివాస్ కు చికిత్స అందించడంతో ఆరోగ్యం కుదుటపడుతోంది. కళ్లు తెరవడం, కాళ్లు కూడా కదుపుతుండడంతో చేతుల్లోనూ కదలికలు రావాలన్న లక్ష్యంతో నర్సులు సినిమా పాటలతో డ్యాన్సులు చేయడం ఆరంభించారు. అతని చేతుల్లో చాలినంత శక్తి లేకపోవడంతో శ్రీనివాస్ మానసిక ధృడత్వం రావాలని అప్పుడే కదలిక ప్రారంభం అవుతుందని భావించి ఈ రకమైన చికిత్స చేయడం ఆరంభించారు. నర్సుల ఆటపాటలతో కొంతమేర కదలికలు కూడా ప్రారంభం కావడంతో పేషెంట్ ను ఐసీయూ నుండి జనరల్ వార్డుకు తరలించి సహజసిద్ధమైన చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Tags:    

Similar News