HYD పేరు మారుస్తారా? కలకలం రేపుతున్న టీ కాంగ్రెస్ ట్వీట్

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజధాని హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తానన్న బీజేపీపై టీ కాంగ్రెస్

Update: 2022-07-02 10:00 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజధాని హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తానన్న బీజేపీపై టీ కాంగ్రెస్ సెటైర్లు వేసింది. 'గుజరాత్‌లో 20 ఏళ్లకు పైగా అధికారంలో ఉన్న బీజేపీ అహ్మదాబాద్ నగరం పేరును మార్చలేకపోయింది. కానీ, ఇప్పుడు హైదరాబాద్ పేరు మార్చాలని మాట్లాడుతున్నారు, బీజేపీని మూర్ఖులు మాత్రమే నమ్ముతున్నారు'అంటూ ట్వీట్ చేసింది. కాగా, బీజేపీ నాయకులు కొందరు హైదరాబాద్ పేరు మార్చుతామని ఎన్నికల ప్రచారంలో చెప్పారు. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా బీజేపీ అధికారంలోకి వస్తే.. హైదరాబాద్ పేరు మార్చుతామని వ్యాఖ్యానించారు. 

Similar News