B.Tech Ravi: సీఎం జగన్ పర్యటనలో ఉద్రిక్తత.. బీటెక్ రవి హౌస్ అరెస్ట్

TDP MLC B.Tech Ravi has Arrested Due to CM Jagan Pulivendula Tour| ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పులివెందుల పర్యటన సంద‌ర్భంగా పులివెందులలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసి పులివెందుల రైతాంగ సమస్యలను వివరించేందుకు టీడీపీ ఎమ్మెల్సీ

Update: 2022-07-07 11:18 GMT

దిశ, ఏపీ బ్యూరో : TDP MLC B.Tech Ravi has Arrested Due to CM Jagan Pulivendula Tour| ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పులివెందుల పర్యటన సంద‌ర్భంగా పులివెందులలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసి పులివెందుల రైతాంగ సమస్యలను వివరించేందుకు టీడీపీ ఎమ్మెల్సీ గురువారం తన స్వగృహం నుంచి బయలుదేరారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని బీటెక్ రవిని హౌస్ అరెస్ట్ చేశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రికి వివరించేందుకు వెళ్తున్నానని.. అలాంటి తనను హౌస్ అరెస్ట్ చేయడం ఏంటని బీటెక్ రవి ప్రశ్నించారు. సీఎం వైఎస్ జగన్‌ను కలిసే అవకాశం ఇవ్వాలని అధికారులను కోరారు. దీంతో పోలీసు అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి బీటెక్ రవి విజ్ఞప్తిని తీసుకెళ్లారు. అయితే టీడీపీకి చెందిన ఐదు మందితో ఒక బృందం మీడియా ద్వారా ముఖ్యమంత్రితో కలిసే విధంగా చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హామీ ఇవ్వడంతో బీటెక్ రవి శాంతించారు. ఇదే విషయాన్ని ఎమ్మెల్సీ బీటెక్ రవి ఓ ప్రకటన విడుదల చేశారు. టీడీపీ తరఫున రైతు సమస్యలను మాట్లాడేందుకు పులివెందుల నియోజకవర్గంలోని బ్రాహ్మణ పల్లెకు చెందిన వెంకటరామిరెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ రాఘవరెడ్డి, జయ భరత్ కుమార్ రెడ్డి, గుణకం పల్లె అమర్, బొజ్జాయిపల్లె రాజేశ్వర్ రెడ్డిలను ముఖ్యమంత్రి వద్దకు పంపుతున్నట్లు బీటెక్ రవి ఓ ప్రకటనలో వెల్లడించారు.

Tags:    

Similar News