Pawan kalyan: పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. 1000 మందితో భారీ ప్లాన్ చేసిన క్రిష్

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాల కోసం ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు.

Update: 2022-04-12 09:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాల కోసం ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. ఇక చిత్రం విడుదల రోజైతే ఏకంగా థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంటుంది. తాజాగా.. పవర్ స్టార్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు చిత్రం చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, గ్లింప్స్‌కు అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అయితే, తొలిసారిగా తన కెరీర్‌లో చారిత్రాత్మక నేపథ్యంలో సినిమా చేసేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే 50 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. కొన్ని భారీ యాక్షన్ సన్నివేశాలు ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారు. అందులో భాగంగా 1000 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులు ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లోని బూత్ బంగ్లాలో చిత్ర షూటింగ్ జరుతున్నది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ దొంగగా కనిస్తున్నట్లు తెలుస్తోంది. మెగా సూర్య ప్రొడక్షన్స్‌లో ఏఎమ్ రత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పవన్ సరసన నిధి అగర్వాల్ నటిస్తోంది. ఎంఎం కీరవాణి సంగీతం అందించనున్నారు.

Tags:    

Similar News