సన్నీ లియోన్‌తో మంచు విష్ణు ఎంజాయ్.. వీడియో వైరల్

మంచు‌విష్ణు చాలా గ్యాప్ తర్వాత రాబోతున్న సినిమా ‘గాలి నాగేశ్వర్ రావు’. ఈ సినిమాలో విష్ణు సరసన హీరోయిన్లుగా పాయల్‌రాజ్‌పుత్,

Update: 2022-04-08 15:54 GMT

దిశ, సినిమా: మంచు‌విష్ణు చాలా గ్యాప్ తర్వాత రాబోతున్న సినిమా 'గాలి నాగేశ్వర్ రావు'. ఈ సినిమాలో విష్ణు సరసన హీరోయిన్లుగా పాయల్‌రాజ్‌పుత్, సన్నీ‌లియోన్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రం 2023లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని చిత్రయూనిట్ తెలిపింది. ప్రస్తుతం సన్నీ, విష్ణు చేసిన ఇన్‌స్టాగ్రామ్ వీడియో సోషల్‌మీడియా‌లో వైరల్‌గా మారింది. ఈ వీడియో‌లో సన్నీ మాస్క్‌తో ఉండగా భయపడని విష్ణు.. మాస్క్ తీయగానే షాకై రియాక్షన్ ఇస్తూ పరుగుతీశాడు. ఈ ఫన్నీ వీడియోను సన్నీ, విష్ణు వారి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లలో పోస్ట్ చేశారు. వీడియో చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటూ.. రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియా‌లో వైరల్‌గా మారింది.

Tags:    

Similar News