ఐబ్రోస్ చేయించుకుంటున్నారా? ఈ భయంకరమైన వ్యాధితో బాధపడాల్సి వస్తుంది జాగ్రత్త..

ముఖాన్ని అందంగా తీర్చిదిద్దడంలో కనుబొమ్మల పాత్ర కీలకం. అందుకే అమ్మాయిలు ఐబ్రోస్ చేసుకునేందుకు ఇష్టపడుతుంటారు. కొందరు అయితే

Update: 2024-05-01 05:14 GMT

దిశ, ఫీచర్స్: ముఖాన్ని అందంగా తీర్చిదిద్దడంలో కనుబొమ్మల పాత్ర కీలకం. అందుకే అమ్మాయిలు ఐబ్రోస్ చేసుకునేందుకు ఇష్టపడుతుంటారు. కొందరు అయితే ప్రతిసారి ఇలా చేసుకోవడం కన్నా కొన్ని సంవత్సరాలు అలాగే ఉండిపోయేలా ట్రీట్మెంట్ చేయించుకుంటారు. అయితే ఈ eyebrows microblading వల్ల ఊపిరితిత్తులు ఎఫెక్ట్ అవుతున్నాయని తాజా అధ్యయనం హెచ్చరిస్తుంది. ఈ మోడర్న్ కాస్మెటిక్ టాటూతో సార్కోయిడోసిస్ అనే ఆటో ఇమ్యూన్ కండిషన్ లంగ్స్ ను థిక్ గా చేసి శ్వాస తీసుకోవడాన్ని కష్టం చేస్తుందని వార్నింగ్ ఇస్తున్నారు.

స్లోవేనియాకు చెందిన ఇద్దరు అమ్మాయిలు ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడినట్లు జర్నల్ ఆఫ్ మెడికల్ కేస్ రిపోర్ట్. కాగా కాస్మెటిక్ ట్రీట్మెంట్ తో ఇలాంటి పరిస్థితి తలెత్తడం ఇదే ఫస్ట్ టైం అని పేర్కొంది. గ్రాన్యులోమస్ అని పిలువబడే సెల్స్ ఊపిరితిత్తులు, లింఫ్ నోడ్స్ లో ఈ కండిషన్ డెవలప్ అయిందని వివరించారు. ఈ పద్ధతిలో ఐబ్రోస్ చేసుకోవడాన్ని మానేయాలని సూచిస్తున్నారు.


Similar News