Sri Lanka లో ఎమర్జెన్సీ ప్రకటించిన తాత్కాలిక అధ్యక్షుడు

Sri Lanka's Interim President Ranil Wickremesinghe Announces Emergency| శ్రీలంకలో ఆర్థిక సంక్షోభంతో కొట్టు మిట్టాడుతున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. పరిస్థితులు చేతులు దాటిపోవడంతో చేసేది ఏమి లేక శ్రీలంక తాత్కాలిక

Update: 2022-07-18 06:50 GMT

దిశ,వెబ్‌‌డెస్క్ : Sri Lanka's Interim President Ranil Wickremesinghe Announces Emergency| శ్రీలంకలో ఆర్థిక సంక్షోభంతో కొట్టు మిట్టాడుతున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. పరిస్థితులు చేతులు దాటిపోవడంతో చేసేది ఏమి లేక శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడు విక్రమసింఘె అఖిలపక్ష సమావేశం నిర్వహించి స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్రకటించారు.రాజ్యంగం ప్రకారం ఆర్టికల్ 40(1)సీ ప్రకారం పబ్లిక్ సెక్యూరిటీ ఆర్డిన్స్ చాప్టర్ 40 లోని సెక్షన్ 2 చాప్టర్ 40 సవరించిన ప్రకారం అత్యవసర పరిస్థితి ప్రకటించారు.1959చట్టం నెం.8,1978 చట్టం సంఖ్య 6,1988 చట్టం యొక్క సంఖ్య 28 ద్వారా మీడియాకు వెల్లడించారు. ఈ ఎమర్జెన్సీ సోమవారం నుంచే అమల్లోకి రానుంది.విక్రమసింఘె మాట్లాడుతూ..యుక్రెయిన్ తో యుద్ధం చేస్తోన్న రష్యా పై ఆంక్షలు విధిస్తే దాని ప్రభావం ఇతర దేశాల పై పడిందన్నారు.దీంతో శ్రీలంకలో చమురు ధరలు పెరగడం. నిత్యావసర సరుకులు రేట్లు పెరిగిపోవడంతో,ఆదాయం తగ్గటంతో శ్రీలంక లో 60 లక్షల మందికి ఆహారం దొరకడం లేదని ప్రపంచ ఆహార సంస్థ కార్యక్రమ సంస్థ ఇది వరకు వెల్లడించింది.

ఇది కూడా చదవండి: ఘోర ప్రమాదం.. నదిలో పడిపోయిన బస్సు.. 12 మంది మృతి

Tags:    

Similar News