ప్రపంచ మొట్టమొదటి ఫాస్టెస్ట్ చార్జింగ్ ఫోన్..

దిశ,వెబ్‌డెస్క్: Realme తన GT Neo 3 5G ఫోన్‌ను లాంచ్ చేసింది. .telugu latest news

Update: 2022-03-23 13:49 GMT

దిశ,వెబ్‌డెస్క్: Realme తన GT Neo 3 5G ఫోన్‌ను లాంచ్ చేసింది. దీనిని ప్రత్యేకమైన ఫోన్‌గా కంపెనీ అభివర్ణించింది. స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో ఇది మొట్టమొదటి సారిగా 150W చార్జింగ్‌తో రానుంది. కేవలం 5 నిమిషాల్లో 50 శాతం బ్యాటరీని చార్జ్‌ చేస్తుంది. ప్రస్తుతానికి ఈ స్మార్ట్ ఫోన్ చైనాలో మాత్రమే లభిస్తుంది. త్వరలో ఇండియాలో లాంచ్ కానుంది.

Realme GT Neo 3 5G స్పెసిఫికేషన్స్..

HDR10+సపోర్ట్‌తో 6.7-అంగుళాల AMOLED డిస్‌ప్లే, FHD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది.

Realme డైమెన్సిటీ 8100 చిప్‌సెట్, 9-లేయర్ టెంపర్డ్ VC లిక్విడ్ కూలింగ్, 12GB RAM, 256GB UFS 3.1 స్టోరేజ్‌ ఉంది.

Android 12 ఆధారంగా Realme UI 3.0.తో పనిచేస్తుంది.

50MP+ 8MP (అల్ట్రావైడ్)+ 2MP (టెలి-మాక్రో) ట్రిపుల్ కెమెరా సెటప్‌ ఉంది.

16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

దీని బ్యాటరీ రెండు వేరియంట్లలో వస్తుంది. 150W చార్జింగ్‌తో 4500mAh బ్యాటరీ, మరొకటి 80Wతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

ఇది పర్పుల్, సిల్వర్, గ్రే కలర్స్‌లలో లభిస్తుంది.

Realme GT Neo 3 (80W): 6GB +128GB మోడల్‌కు రూ.23,900. 8GB +128GB వేరియంట్ రూ.27,500. 12GB+256GB రూ.31,700.

Realme GT Neo 3 (150W): 8GB +256GB ధర రూ.32,300. 12GB +256GB మోడల్‌కు రూ.34,700.

Tags:    

Similar News