Ram Nath Kovind: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఫేర్‌వెల్ ఫంక్షన్ అప్పుడే!

President Ram Nath Kovind Farewell Ceremony will be held on July 23| రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ పదవీకాలం పూర్తవుతున్నందున పార్లమెంటు ఉభయ సభల తరఫున ఆయనకు వీడ్కోలు పలికేందుకు 'ఫేర్‌వెల్ ఫంక్షన్' కార్యక్రమాన్ని లోక్‌సభ ఈ నెల 23న ఏర్పాటుచేసింది. పార్లమెంటు సెంట్రల్ హాల్ వేదికగా ఉభయ సభల

Update: 2022-07-15 06:15 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: President Ram Nath Kovind Farewell Ceremony will be held on July 23| రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ పదవీకాలం పూర్తవుతున్నందున పార్లమెంటు ఉభయ సభల తరఫున ఆయనకు వీడ్కోలు పలికేందుకు 'ఫేర్‌వెల్ ఫంక్షన్' కార్యక్రమాన్ని లోక్‌సభ ఈ నెల 23న ఏర్పాటుచేసింది. పార్లమెంటు సెంట్రల్ హాల్ వేదికగా ఉభయ సభల సభ్యుల తరఫున సన్మాన కార్యక్రమం ఉంటుందని లోక్‌సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ ఒక సర్క్యూలర్‌లో ఎంపీలకు తెలియజేశారు. జూలై 23 సాయంత్రం 5.30 గంటల నుంచి ఈ కార్యక్రమం ఉంటుందని, లోక్‌సభ స్పీకర్ ఈ కార్యక్రమంలో రాష్ట్రపతికి వీడ్కోలు పలికే ఉపన్యాసం చేస్తారని పేర్కొన్నారు. ఉభయ సభల సభ్యులందరి తరఫున ఒక మెమెంటో, 'సిగ్నేచర్ బుక్'ను రామ్‌నాధ్ కోవింద్‌కు అందజేయనున్నారు. అనంతరం ఎంపీలందరికీ అక్కడే తేనీటి విందు కూడా ఉంటుందని తెలిపారు.

సిగ్నేచర్ బుక్‌లో అభిప్రాయాలను, సంతకాలను చేయడానికి వీలుగా ఈ నెల 18 నుంచి సెంట్రల్ హాల్‌లో ఆ బుక్‌ను ఎంపీల కోసం అందుబాటులో ఉంచుతున్నట్లు వివరించారు. రాష్ట్రపతి పదవీ విరమణ సందర్భంగా ఎంపీల సంతకాలతో కూడిన 'సిగ్నేచర్ బుక్‌'ను ఇవ్వడం ఒక సంప్రదాయంగా కొనసాగుతున్నది. గతంలో ప్రణబ్ ముఖర్జీకి సైతం టీఆర్ఎస్ ఎంపీలు 'జై తెలంగాణ' నినాదంతో పాటు రాష్ట్ర ఏర్పాటులో ఆయన కృషిని గుర్తుచేస్తూ అభిప్రాయాలను వెల్లడించారు.

ఇది కూడా చదవండి: మాజీ విశ్వసుందరితో ఐపీఎల్ మాజీ చైర్మెన్ డేటింగ్ 

Tags:    

Similar News