టెన్త్ ఫలితాల్లో రెండవ స్థానంలో నిర్మల్ జిల్లా
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : పదో తరగతి ఫలితాల్లో నిర్మల్ జిల్లా - Nirmal district came second in the Tent results
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : పదో తరగతి ఫలితాల్లో నిర్మల్ జిల్లా రెండవ స్థానంలో నిలవడం పట్ల దేవాదాయ శాఖ మంత్రి హర్షం వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లాలో కొలువై ఉన్న చదువుల తల్లి బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆశిస్సులతో రానున్న రోజుల్లో ప్రథమ స్థానంలో నిలిచేందుకు మరింత కృషి చేస్తామన్నారు. నాణ్యమైన విద్యాబోధన, ప్రత్యేక తరగతులు, ప్రత్యేక ప్రణాళికలు, పాఠశాలల్లో మెరుగైన వసతులను ప్రభుత్వం కల్పించడంతో పాటు విద్యార్థుల పట్టుదల, అధికారులు, ఉపాధ్యాయుల ప్రత్యేక చొరవ, తల్లిదండ్రుల సహకారంవల్లే ఈ ఘనత సాధించామన్నారు. తల్లిదండ్రుల, తమ కలలను సాకారం చేసుకోవడానికి, జీవితంలో మరింత ఎత్తుకు ఎదిగేందుకు విద్యార్థులు కృషి చేయాలని సూచించారు.