Munugode Effect: నల్గొండ వ్యక్తికి కేసీఆర్ కీలక పదవి

Munugode Effect KCR Appoints Eslavath Ramchander Naik as the TSSTCFDC| తెలంగాణలో పోలిటికల్ హీట్ రాజుకుంది. ఉప ఎన్నిక వస్తే మునుగోడులో జెండా పాతేందుకు రాజకీయ పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలతో తమ జోరు పెంచాయి. ఈ క్రమంలో నియోజకవర్గంలో సామాజిక వర్గాల

Update: 2022-08-05 07:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: Munugode Effect KCR Appoints Eslavath Ramchander Naik as the TSSTCFDC| తెలంగాణలో పోలిటికల్ హీట్ రాజుకుంది. ఉప ఎన్నిక వస్తే మునుగోడులో జెండా పాతేందుకు రాజకీయ పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలతో తమ జోరు పెంచాయి. ఈ క్రమంలో నియోజకవర్గంలో సామాజిక వర్గాల వారీగా కలిసి వచ్చే లెక్కలపై కేసీఆర్ దృష్టి పడినట్లు చర్చ జరుగుతోంది. ప్రభావం చూపేలా పదవుల పందేరానికి సీఎం కేసీఆర్ తెరలేపినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. తాజాగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన వ్యక్తికి నామినేట్ పోస్టును కట్టబెట్టడం వెనుక మునుగోడు ఎఫెక్టే కారణం అనే టాక్ వినిపిస్తోంది. గిరిజన సంక్షేమ శాఖలో తెలంగాణ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కో ఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (TSSTCFDC) ఛైర్మన్‌గా ఎస్లావత్ రాంచందర్ నాయక్‌ను ముఖ్యమంత్రి గురువారం నియమించారు. ఈ నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని ఆదేశాలు జారీ చేశారు. రాంచందర్ నాయక్ నల్గొండ జిల్లాకు చెందిన వ్యక్తి కావడంతో ఈ నియామకం వెనుక రాజకీయ చర్చ మొదలైంది.

మరికొన్ని వర్గాలపై వరాల జల్లు?

గతంలో హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలోనూ కేసీఆర్ ఎలాంటి ఎత్తుగడ అవలంభించారో ఇప్పుడు అదే తరహా ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం జోరందుకుంది. హుజూరాబాద్ ఉపఎన్నిక సమయంలో ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్‌గా బండా శ్రీనివాస్‌ను సీఎం కేసీఆర్ నియమించారు. శ్రీనివాస్ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ వాసి కావడం అప్పట్లో చర్చనీయాంశం అయింది. తాజాగా మునుగోడు నియోజక వర్గంలో ఎస్టీ ఓటర్లు అధికంగా ఉన్నారని, వారిని అధికార పార్టీ వైపు ఆకర్షించడమే లక్ష్యంగా టీఎస్ఎస్ టీసీఎఫ్ డీసీ ఛైర్మన్‌గా ఎస్లావత్ రాంచందర్ నాయక్‌కు పదవిని కట్టబెడుతూ ఈ ఎత్తుగడ వేసినట్లు టాక్ వినిపిస్తోంది. అంతే కాకుండా రాబోయే రోజుల్లో ప్రభుత్వంలోని వివిధ నామినేటెడ్ పదవులకు మరికొంత మంది నేతలను నామినేట్ చేయడంతో పాటు మునుగోడుపై హామీల వర్షం కురిపించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ప్రత్యర్థులకు ఛాన్స్ లేకుండా :

గతంలో దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాల్లో వచ్చిన అనుభవం దృష్ట్యా ఈసారి మునుగోడులో ఏ మాత్రం ఛాన్స్ తీసుకోవద్దని కేసీఆర్ భావిస్తున్నారట. నియోజకవర్గంలోని ముఖ్యమైన నేతలు టీఆర్ఎస్‌ను వీడకుండా కాపాడుకుంటూనే మరోవైపు ఇతర పార్టీల్లోని బలమైన నాయకులను సాధ్యమైనంత ఎక్కవ మందిని తమ వైపు తిప్పుకోవాలని యోచిస్తున్నారట. సామాజిక సమీకరణాలతో బలమైన నేతలకు పదవులను కట్టబెట్టి వారిని పార్టీ కోసం పనిచేసేలా కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కేసులో అనూహ్య పరిణామం

Tags:    

Similar News