తెరాస పాలనలోనే ఆలయాల అభివృద్ధి: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Update: 2022-02-13 13:39 GMT

దిశ, నిర్మల్ కల్చరల్: నిర్మల్ పట్టణం ఈదిగాం శివాజీ నగర్ లో నూతనంగా నిర్మించిన శ్రీ నల్ల పోచమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఆదివారం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నల్ల పోచమ్మ ఆలయాన్ని రూ 15 లక్షల నిధులతో సుందరంగా నిర్మించామన్నారు. తెరాస ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత నిర్మల్ నియోజకవర్గంలో ఆలయాలు అభివృద్ధి నోచుకున్నాయని అన్నారు. నిర్మల్ పట్టణంలో ప్రతీ పురాతన ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిసిసిబి చైర్మన్ రాంకిషన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, లైబ్రరీ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News