చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు యథాతథం! Public Provident Fund (PPF)

న్యూఢిల్లీ: చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లకు సంబంధించి..telugu latest news

Update: 2022-03-31 15:17 GMT

న్యూఢిల్లీ: చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లకు సంబంధించి కేంద్రం కీలక ప్రకటన వెల్లడించింది. పెరిగిన ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత(2022-23) ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో Public Provident Fund (PPF) National Savings Certificate (NSC), Public Provident Fund (PPF)  సహా ఇతర చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతున్నట్టు ప్రకటించింది. 2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం సమయం నుంచి వీటి వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రస్తుతం పీపీఎఫ్ పథకాలపై 7.1 శాతం, ఎన్ఎస్‌సీ పథకాలపై 6.8 శాతం వడ్డీ రేట్లు అమలవుతున్నాయి.

ఈ క్రమంలో ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు పలు చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ గురువారం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. చిన్న మొత్తాల పొదుపు పథకాలకు వడ్డీ రేట్లు త్రైమాసిక ప్రాతిపదికన నిర్ణయిస్తారు. ప్రస్తుతం ఉన్న వడ్డీ రేట్లను గమనిస్తే.. ఏడాది టర్మ్ డిపాజిట్ పథకంపై 5.5 శాతం, సుకన్య సమృద్ధి యోజన పథకంపై 7.6 శాతం, ఐదేళ్ల సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌పై 7.4 శాతం, సేవింగ్స్ డిపాజిట్లపై ఏడాదికి 4 శాతం వడ్డీ కొనసాగుతుంది.

Interest rates on small savings schemes unchanged for first quarter of ఫ్య౨౩

Public Provident Fund (PPF) and National Savings Certificate (NSC) 

Tags:    

Similar News