Monkeypox: మంకీపాక్స్ మూడో కేసు నమోదు..

India's Third Monkeypox Case Registered From Kerala| కేరళలో మంకీపాక్స్ మూడో కేసు నమోదైందని శుక్రవారం రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. దేశంలో ఫస్ట్, సెకండ్, థర్డ్ మంకీపాక్స్ కేసులు కేరళలోనే నమోదయ్యాయి. ఈ నెల ప్రారంభంలో యూఏఈ నుంచి కేరళకు వచ్చిన 35 ఏళ్ల వ్యక్తిలో

Update: 2022-07-22 10:24 GMT

తిరువనంతపురం: India's Third Monkeypox Case Registered From Kerala| కేరళలో మంకీపాక్స్ మూడో కేసు నమోదైందని శుక్రవారం రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. దేశంలో ఫస్ట్, సెకండ్, థర్డ్ మంకీపాక్స్ కేసులు కేరళలోనే నమోదయ్యాయి. ఈ నెల ప్రారంభంలో యూఏఈ నుంచి కేరళకు వచ్చిన 35 ఏళ్ల వ్యక్తిలో మంకీపాక్స్ వైరస్ గుర్తించినట్లు అధికారులు తెలిపారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం హై అలర్ట్ విధించింది. మలప్పురానికి చెందిన ఓ వ్యక్తి జులై 6వ తేదీన యూఏఈ నుంచి కేరళకు వచ్చారు. మంకీపాక్స్ లక్షణాలు బయటపడటంతో మంజేరి మెడికల్ కళాశాలలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ పేర్కొన్నారు.

జులై 14వ తేదీన కేరళలోని కొల్లామ్‌లో మొదటి మంకీపాక్స్ కేసు నమోదు కాగా.. గత సోమవారం కన్నూర్ జిల్లాలో రెండవ కేసు నమోదైంది. వీరిద్దరిని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. అలాగే వారి సంబంధీకులను గుర్తించి సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంచుతున్నారు. జ్వరం, తలనొప్పి, ఫ్లూతో ఇన్ఫెక్షన్ మొదలవుతుందని, ఇన్ఫెక్షన్ తీవ్రమైనప్పుడు శరీరంపై ఎర్రటి దద్దుర్లు ఏర్పడుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. వ్యాధి సోకిన వ్యక్తిని తాకడం, వాడిన బట్టలు వేసుకోవడం, శారీరకంగా కలవడం వంటి పనులు చేయకూడదని వైద్యులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఫ్లాష్.. ఫ్లాష్.. జమిలి ఎన్నికలపై కేంద్రం సంచలన ప్రకటన

Tags:    

Similar News