తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు

నైరుతి రుతు పవనాలు చురుగ్గా కదులుతుండడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నేడు, రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని

Update: 2022-07-07 15:26 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: నైరుతి రుతు పవనాలు చురుగ్గా కదులుతుండడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో శనివారం నుంచి సోమవారం ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఇందులో భాగంగానే తెలంగాణలో 9వ తేదీన అత్యంత భారీ వర్షం కురిసే అవకాశమున్నట్టు పేర్కొంది. కాగా శనివారం ఆరెంజ్, ఆదివారం రెడ్ అలర్ట్ లను జారీ చేసింది. ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటక, కేరళ, మహారాష్ఠ్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లోనూ విస్తారంగా వర్షాలు కురవనున్నట్టు తెలిపింది. ముఖ్యంగా ఈ రోజు, 11 వ తేదీన కోస్తాంధ్ర, తెలంగాణ, యానాంలో భారీ వర్షాలు పడనుందని ఐఎండీ వెల్లడించింది.

శనివారం తెలంగాణలోని జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్‌లి, సిద్ధిపేట మరియు కాయారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో వాతావరణ ​అధికారులు ఆరెంజ్ అలర్ట్ ను ప్రకటించారు. మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ జిల్లాలకు ఇప్పటికే రెడ్ అలర్ట్ ను ప్రకటించారు.

Tags:    

Similar News