Etala Rajender: సీఎం కేసీఆర్‌పై పోటీకి ఈటల సై.. గజ్వేల్‌లో బెంగాల్ ప్లాన్

Etala Rajender Says he will Contest Against CM KCR| టీఆర్ఎస్ పార్టీని అధికారంలో నుండి దింపాలని చూస్తున్న బీజేపీ సీఎం కేసీఆర్ పై కూడా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ పై

Update: 2022-07-09 10:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: Etala Rajender Says he will Contest Against CM KCR| టీఆర్ఎస్ పార్టీని అధికారంలో నుండి దింపాలని చూస్తున్న బీజేపీ సీఎం కేసీఆర్ పై కూడా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ పై పోటీ చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన .. గజ్వేల్ లో పోటీ చేసేందుకు సీరియస్ గా వర్క్ చేస్తున్నానని అన్నారు. గజ్వేల్ లో పోటీ విషయాన్ని తాను ఇదివరకే చెప్పానని అన్నారు. పశ్చిమబెంగాల్ తరహాలో తెలంగాణలోనూ సీఎంను ఓడించాలని పిలుపునిచ్చారు.

పక్కా ప్లాన్ తో బీజేపీ

బెంగాల్ మాదిరిగా ముఖ్యమంత్రిని ఇక్కడ ఓడించాలన్న ఈటల వ్యాఖ్యల వెనుక బీజేపీ వ్యూహం ఏంటో ఇట్టే అర్థం అవుతోందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. టార్గెట్ టీఆర్ఎస్ తో పాటు టార్గెట్ కేసీఆర్ గా పని చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గత బెంగాల్ ఎన్నిగల్లో సీఎం మమతా బెనర్జీని సీరియస్ గా తీసుకున్న బీజేపీ.. అక్కడ మమతను ఎమ్మెల్యేగా ఓడించింది. మమతపై బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి విజయం సాధించారు. తెలంగాణలోనూ సువేందు అధికారి దృశ్యం పునరావృతం అవుతుందని ఈటల అన్నారు. ఓ వైపు టీఆర్ఎస్ ను ఇరుకున పెడుతూనే.. మరోవైపు కేసీఆర్ సీటుకు ఎసరు పెట్టేలా ప్రణాళిక రచిస్తోంది. గజ్వేల్ నుండి రెండు దఫాలుగా పోటీ చేసి విజయం సాధించిన కేసీఆర్.. ఈసారి తన స్థానాన్ని మార్చబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఒక వేళ సీఎం తన స్థానాన్ని మార్చుకుని ఎక్కడికి వెళ్లినా అక్కడ గట్టి పోటీ ఇచ్చేలా వ్యూహం సిద్దం చేసుకున్నట్లు టాక్ నడుస్తోంది.

ఆపరేషన్ ఆకర్ష్ తో టీఆర్ఎస్ కు షాక్ తప్పదా?

తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు కృషి చేస్తున్న బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ పై ప్రత్యేక నజర్ వేసింది. ఇప్పటికే ఈ విషయంలో కమిటీని ఏర్పాటు చేసి ఈటల రాజేందర్ కు ఆ బాధ్యతలు అప్పగించింది. ఈ నేపథ్యంలో స్పందించిన ఈటల.. ఆసక్తికర వ్యాఖ్యలే చేశారు. త్వరలో బీజేపీలోకి భారీ చేరికలు ఉంటాయని అన్నారు. ఈటల రాజేందర్ గతంలో టీఆర్ఎస్ లో కీలకమైన నేతగా పని చేశారు. ఆ పార్టీలో అగ్రనేతల నుండి క్షేత్రస్థాయి వరకు ఈటలకు పరిచయాలు ఉన్నాయి. అదును చూసి కేసీఆర్ ను దెబ్బకొట్టేందుకే బీజేపీ ఈటలకు ఈ బాధ్యతలను అప్పటించినట్లు రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఓ వైపు కేసీఆర్ పై పోటీకి సై అంటూనే... మరోవైపు పార్టీలో చేరికలపై ఈటల దృష్టి సారించడం వెనుక బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందనే చర్చ జరుగుతోంది.

Tags:    

Similar News