దిశ వరుస కథనాలకు స్పందన... అధికారిణిపై బదిలీ వేటు

దిశ, మహబూబాబాద్: మహబూబాబాద్ ఫారెస్ట్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న రేంజ్ అధికారిణి ఆశాలత దాస్ పై బదిలీ వేటు పడింది...Disha News Effect: Manukota FRO Ashalatha Das Transfered

Update: 2022-06-25 03:37 GMT

దిశ, మహబూబాబాద్: మహబూబాబాద్ ఫారెస్ట్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న రేంజ్ అధికారిణి ఆశాలత దాస్ పై బదిలీ వేటు పడింది. అటవీ శాఖ చరిత్రలోనే కొత్త ఉద్యోగం సృష్టించి ఆ ఉద్యోగానికి ఆమెను బదిలీ చేశారు. రికార్డ్ సెల్ వరంగల్ సర్కిల్ పరిధిలోని హన్మకొండ జిల్లాలో సర్వే ల్యాండ్ స్పెషల్ డ్యూటీ పోస్ట్ లో నియమించబడ్డారు. కాగా ఈ ఎఫ్ఆర్ఓ అక్రమంగా కలప తరలిస్తున్నారన్నా సమాచారం మేరకు సుమారు రూ. 4 లక్షల విలువైన కలపను పట్టుకుని ఆమె ఇంట్లో భద్రపర్చుకున్నట్లు కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు ప్రిన్సిపాల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ కార్యాలయంకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై మే నెలలో ఇంతకీ దొంగ ఎవరు... ఎఫ్ఆర్ఓ ఎస్కేప్ కు ప్లాన్.. విచారణ ఏమైనట్లు.. అనే వరుస కథనాలను ప్రచురించిగా ఎట్టకేలకు ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు రంగంలోకి దిగి విచారణ చేశారు. నివేదిక ఆధారంగా ఈ నెల 24 (శుక్రవారం సాయంత్రం)వ తేదీన ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ కార్యాలయం నుండి ఆమెపై చర్యల్లో భాగంగా బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంతేకాకుండా ఇంకా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మొత్తంగా రేంజి స్థాయి అధికారిణి అటవీ శాఖలో పెను ప్రకంపనలు సృష్టించింది. 





Similar News