గుర్రంపై ఫుడ్ డెలివరీ... వైరల్ అవుతున్న వీడియో

దిశ, వెబ్ డెస్క్: ఆన్‌లైన్ డెలివరీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఈ మధ్య చాలామంది...delivery boy rides horse for deliver food amid rains

Update: 2022-07-05 04:01 GMT

దిశ, వెబ్ డెస్క్: ఆన్‌లైన్ డెలివరీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఈ మధ్య చాలామంది పుడ్ ఆర్డర్ చేసుకుని తినేందుకే ఆసక్తి చూపుతున్నారు. అయితే, డెలివరీ బాయ్స్ మాత్రం కస్టమర్స్ ఆర్డర్ చేసిన ఫుడ్ ను సమయానికి తెచ్చియ్యాల్సి ఉంటుంది. అయితే, ముంబై నగరంలో వర్షాలు కురవడంతో బైక్‌పై ప్రయాణించి ఫుడ్ ఆర్డర్ చేసేందుకు డెలివరీ బాయ్ కు ఇబ్బందిగా మారింది. దీంతో అతను వినూత్నంగా ఆలోచించాడు. గుర్రంపై వెళ్లి సమయానికి ఫుడ్ ను డెలివరీ చేస్తున్నాడు. ఓ వ్యక్తి వీడియో తీసి యూట్యూబ్ లో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో వైరల్ మారింది. ఆ డెలివరీ బాయ్‌పై నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Similar News