Assam Floods: అస్సాంలో వరదలు బీభత్సం

Death Toll Rises to 187 in Assam Floods, Over 9 Lakh People Still Affected| అస్సాం రాష్ట్రంలో ఇటీవల వరదలు బీభత్సం సృష్టించాయి. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో వరద పరిస్థితి సర్దుమణుగుతున్నట్లు అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఏఎస్‌డీఎంఏ) నివేదిక సమర్పించింది.

Update: 2022-07-08 11:44 GMT

గువహటి: Death Toll Rises to 187 in Assam Floods, Over 9 Lakh People Still Affected| అస్సాం రాష్ట్రంలో ఇటీవల వరదలు బీభత్సం సృష్టించాయి. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో వరద పరిస్థితి సర్దుమణుగుతున్నట్లు అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఏఎస్‌డీఎంఏ) నివేదిక సమర్పించింది. ఆరు జిల్లాల్లో పరిస్థితి కంట్రోల్‌లో ఉందని, మరో 12 జిల్లాల్లో 9.06 లక్షల మంది వరద బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెల్లడించింది.

అత్యధికంగా కచార్ జిల్లాలో 5.63 లక్షల మంది వరద బాధితులు ఉన్నాయని ఏఎస్‌డీఎంఏ నివేదించింది. నాగోన్‌ జిల్లాలో 1,56,731 మంది.. మోరిగావ్ జిల్లాలో 1,51,842 మంది వరద బాధితులు ఉన్నారని పేర్కొంది. 17,068 హెక్టార్లలో పంటలు నీట మునిగాయని వెల్లడించింది. కాగా, గడిచిన 24 గంటల్లో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని అధికారులు వెల్లడించారు. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు మృతుల సంఖ్య 187కు చేరిందన్నారు. ఇందులో వరదల కారణంగా 169 మంది, కొండచరియలు విరిగిపడి 18 మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు.

అస్సాం సీఎం హిమంత బిశ్వ ఆదేశాల మేరకు 12 జిల్లాల్లో 207 సహాయ శిబిరాలను నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా, 2022-23 నాటికి కేంద్రం రాష్ట్ర విపత్తు నిధిని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని సీఎం హిమంత బిశ్వా తెలిపారు. రూ.324.40 కోట్లు విడుదల చేసినందుకు గానూ ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం హిమంత బిశ్వా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Tags:    

Similar News