CM Jagan: కేసులపై జగన్ కీలక వ్యాఖ్యలు.. ఆ సైన్యానికి సెల్యూట్

CM Jagan Response Over His Cases in YSRCP Plenary| వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాశ్వత(జీవిత కాల) అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను ప్రకటించారు. ప్లీనరీ వేదికగా ఈ విషయాన్ని వైసీపీ కీలక నాయకుడు, రాజ్యసభ పక్షనేత విజయసాయిరెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ..

Update: 2022-07-09 09:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: CM Jagan Response Over His Cases in YSRCP Plenary| వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాశ్వత(జీవిత కాల) అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను ప్రకటించారు. ప్లీనరీ వేదికగా ఈ విషయాన్ని వైసీపీ కీలక నాయకుడు, రాజ్యసభ పక్షనేత విజయసాయిరెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. విజయవాడ-గుంటూరు మధ్య మహా సముద్రం కనిపిస్తోందని, ఆది ఆత్మీయుల సునామీ అని భారీగా తరలివచ్చిన కార్యకర్తలను ఉద్దేశించి ఉత్సాహంగా మాట్లాడారు. ఎన్నో త్యాగాలు చేసిన మహా వైసీపీ శ్రేణులకు మరోసారి సెల్యూట్ చేశారు. టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలు కలిసిపోయి తనపై అక్రమంగా కేసులు పెట్టాయని, అరెస్ట్ సైతం చేయించారని, కానీ వాటికి జగన్ బెదరలేదని అన్నారు. ఆనాడు జగన్ భయపడి ఉంటే, ఈనాడు మీ ఎదుట ఇలా ఉండే వాడు కాదని వెల్లడించారు. నాడు నా ఒక్క ఎంపీతో ప్రారంభమైన వైసీపీ ప్రస్థానం, ఇవాళ 22కు చేరిందని అన్నారు. ఆ రెండు పార్టీలు ఒకలా కుట్ర చేస్తే.. దేవుడు మరోలా స్క్రిప్ట్ రాశాడని తెలిపారు. తనను అరెస్ట్ చేసి ఇబ్బందులకు గురిచేసిన పార్టీలను ప్రజలు నామారూపాల్లేకుండా చేశారని ఎద్దేవా చేశారు. సంతలో పశువుల్లా మా పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని అన్నారు.

Tags:    

Similar News