ఆ కంపెనీ వ్యాపారం ఇదే.. ఒక్క బిడ్డను కనిస్తే కోట్లు ముట్టజెప్తుంది..

యూరోపియన్ కంట్రీస్ అధికంగా వృద్ధాప్య జనాభాను కలిగి ఉన్నాయి. ప్రస్తుతం సంతానోత్పత్తి కూడా తక్కువగానే ఉంది. ముఖ్యంగా

Update: 2024-04-28 05:46 GMT

దిశ, ఫీచర్స్ : యూరోపియన్ కంట్రీస్ అధికంగా వృద్ధాప్య జనాభాను కలిగి ఉన్నాయి. ప్రస్తుతం సంతానోత్పత్తి కూడా తక్కువగానే ఉంది. ముఖ్యంగా 2022 లెక్కల ప్రకారం అత్యల్ప ఇన్‌ఫెర్టిలిటీ రేట్ 0.78తో సౌత్ కొరియా బాటమ్ పొజిషన్‌లో ఉండగా.. 2025 నాటికి మరింత తగ్గనుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని.. ఆ దేశ జనాభాను పెంచేందుకు ప్రయత్నిస్తోంది ఓ కంపెనీ. ఒక్క బిడ్డను కంటే ఏకంగా అరవై మూడు లక్షలు చెల్లించేందుకు ముందుకొచ్చింది.

సియోల్‌కు చెందిన బియోంగ్ గ్రూప్ ఉద్యోగులకు బిడ్డ పుట్టిన ప్రతిసారి ఇంత పెద్ద మొత్తాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. నగదు లేదా గృహాల రూపంలో ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని తెలిపింది. పిల్లల పెంపకం భారాన్ని తగ్గించేందుకే ఈ ప్రత్యక్ష ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు వివరించింది.ఇక పుట్టుకలను ప్రోత్సహించే కంపెనీగా గుర్తింపు లభిస్తుందని ఆశిస్తున్నామన్న Booyoung గ్రూప్ ఛైర్మన్ లీ జూంగ్-కెయున్.. దేశ భవిష్యత్తు గురించే తమ ఆందోళన అని తెలిపాడు. పుట్టిన పిల్లలు ఇబ్బంది పడకుండా ఇప్పటి వరకు 2,70,000 గృహాలను నిర్మించినట్లు చెప్పాడు.

Similar News