Balakrishna కు రెండోసారి కొవిడ్.. టెన్షన్‌లో ఫ్యాన్స్

Balakrishna Tests Corona Positive for Second Time| సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ రెండోసారి కొవిడ్‌ బారినపడ్డారు. బాలయ్యతో పాటు ఈ సినిమాకు పనిచేస్తున్న ఇతర చీఫ్ టెక్నీషియన్స్, నటీనటులకు కూడా పాజిటివ్ రావడంతో #NBK107 షూటింగ్‌‌కు తాత్కాలికంగా బ్రేక్ పడింది

Update: 2022-07-13 06:49 GMT

దిశ, సినిమా : Balakrishna Tests Corona Positive for Second Time| సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ రెండోసారి కొవిడ్‌ బారినపడ్డారు. బాలయ్యతో పాటు ఈ సినిమాకు పనిచేస్తున్న ఇతర చీఫ్ టెక్నీషియన్స్, నటీనటులకు కూడా పాజిటివ్ రావడంతో #NBK107 షూటింగ్‌‌కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. వారంతా కోలుకుని తిరిగి సెట్స్‌కు రావాలంటే సమయం పట్టేలా ఉండటంతో ఈ సినిమా దసరాకు విడుదలవడం అసాధ్యమనే టాక్ వినిపిస్తోంది. పైగా ఎడతెరిపిలేని వర్షాలు సైతం షూటింగ్‌కు అంతరాయం కలిగించవచ్చని, ఈ మేరకు రిలీజ్‌ను డిసెంబర్‌కు వాయిదా వేయొచ్చని అంటున్నారు.

ఇక ఇటీవలే సినిమాకు సంబంధించి బాలయ్య ఫస్ట్ లుక్ విడుదల చేయగా.. 'జై బాలయ్య లేదా రామారావు గారు' టైటిల్స్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. వీటితో పాటు 'నాయకుడు' టైటిల్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇవన్నీ పట్టించుకోని అభిమానులు.. ముందు బాలయ్య కోలుకుంటే చాలని అభిప్రాయపడుతున్నారు.

Also Read: బాలయ్య బోల్డ్ క్యారెక్టర్.. 'డబుల్ మీనింగ్' డైలాగ్స్‌తో ఫ్యాన్స్‌కు పండగే

Tags:    

Similar News