Air India: ఎయిరిండియా ఢిల్లీ-మాస్కో సర్వీసులు రద్దు

న్యూఢిల్లీ: నెల రోజులకు పైగా సాగుతున్న ఉక్రెయిన్ రష్యా యుద్ధ ప్రభావం..telugu latest news

Update: 2022-04-07 13:43 GMT

న్యూఢిల్లీ: నెల రోజులకు పైగా సాగుతున్న ఉక్రెయిన్ రష్యా యుద్ధ ప్రభావం ఎయిరిండియా విమానాలపై పడింది. భీమా భద్రత కారణాలతో ఢిల్లీ-మాస్కో విమానాన్ని రద్దు చేసినట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఈ విషయాన్ని రష్యన్ ఎంబసీ ప్రకటించినట్లు తెలిపారు. దీనిలో భాగంగానే టికెట్ అమ్మకాలను కూడా నిలిపివేసినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు రష్యన్ స్థానిక మీడియా కథనం వెల్లడించింది. దేశ పౌరులారా, భారత ఎయిర్ లైన్ ఎయిర్ ఇండియా ఢిల్లీ-మాస్కో-ఢిల్లీ మార్గంలో టిక్కెట్ల అమ్మకాలను నిలిపివేసింది. ముందస్తు టికెట్లు బుక్ చేసుకున్న వారికి పూర్తి రీఫండ్ ఎయిర్ ఇండియా కార్యాలయం ప్రకటించిందని కథనంలో పేర్కొంది. అయితే భారత్ చేరుకునేందుకు ప్రత్నామ్యాయ మార్గాలుగా ఉన్న తాష్కెంట్, ఇస్తాంబుల్, దుబాయ్, అబుదాబీ, దోహ ప్రాంతాలను వినియోగించుకుంటామని రష్యన్ ఎంబసీ తెలిపింది. కాగా, ఈ మధ్యనే 52 మిత్ర దేశాలతో విమాన ప్రయాణాలపై కొవిడ్ నిబంధనలపై స్వస్తి పలికింది. అయితే యుద్ద నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ తో సహా, 36 దేశాలకు గగనతలాన్ని మూసివేసింది.

Tags:    

Similar News