తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం.. శ్రీవారి ధర్మరథం దగ్ధం(వీడియో)

దిశ, రాయలసీమ: తిరుమల రెండో ఘాట్ రోడ్డులో శనివారం ప్రమాదం జరిగింది.

Update: 2022-03-26 12:53 GMT

దిశ, రాయలసీమ: తిరుమల రెండో ఘాట్ రోడ్డులో శనివారం ప్రమాదం జరిగింది. అలిపిరి నుంచి తిరుమల వెళ్తున్న శ్రీవారి ధర్మరథం ( ఉచిత బస్సు )లో మంటలు చెలరేగాయి. సమచారం అందుకున్న టీటీడీ అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. చివరి మలుపులో ఈ ప్రమాదం జరిగింది. ప్రయాణికులు వెంటనే అప్రమత్తమై బస్సు నుండి కిందకు దిగిడంతో ప్రాణప్రాయం తప్పింది. కాగా, బస్సు నుంచి డిజిల్ లీకై ఈ ప్రమాదం జరిగిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Similar News