నావీ దళం కీలక నిర్ణయం ప్రతి ఖండానికి భారత నౌక

న్యూఢిల్లీ: దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో ఖండంతారాలకు దేశ ఖ్యాతి తెలిసే విధంగా భారత నావీ దళం కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2022-08-06 16:47 GMT

న్యూఢిల్లీ: దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో ఖండంతారాలకు దేశ ఖ్యాతి తెలిసే విధంగా భారత నావీ దళం కీలక నిర్ణయం తీసుకుంది. అజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా భారత నావీకా దళం నౌకలను అన్ని ఖండాలకు పంపనుంది. ఆసియాలో ఐఎన్ఎస్ చెన్నై, ఐఎన్ఎస్ బెట్వా మస్కట్‌ను సందర్శించనుండగా, ఐఎన్ఎస్ సరయూ సింగపూర్ ను సందర్శించనుంది. ఐఎన్ఎస్ కెన్యాలోని మోంబాస, ఐఎన్ఎస్ సుమేధా పెర్త్(ఆస్ట్రేలియా), ఐఎన్ఎస్ సప్తురా(ఉత్తర అమెరికా), ఐఎన్ఎస్ తర్కష్ బ్రెజిల్(దక్షిణ అమెరికా), ఐఎన్ఎస్ తరంగిణి లండన్ పర్యటించనుంది. రెండు ప్రపంచ యుద్ధాల సమయంలో అత్యున్నత త్యాగం చేసిన భారత సైనికులకు ఐఎన్ఎస్ తరంగిణి నివాళులర్పించనుంది. ఆయా పోర్టుల్లో నౌకలు చేరాక స్వాతంత్ర్య వేడుకలను తెలిపేలా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అయితే అంటార్కిటికా మాత్రం నౌకలు వెళ్లవని అధికారులు వెల్లడించారు.

Similar News