అమెజాన్‌లో 'హోలీ షాపింగ్ స్టోర్'.. 60% డిస్కౌంట్

దిశ,వెబ్‌‌డెస్క్: ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ హోలీ పండుగ సందర్భంగా కొత్త ఆఫర్‌ను.telugu latest news

Update: 2022-03-15 16:26 GMT

దిశ,వెబ్‌‌డెస్క్: ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ హోలీ పండుగ సందర్భంగా కొత్త ఆఫర్‌ను తెచ్చింది. వినియోగదారుల కోసం 'హోలీ షాపింగ్ స్టోర్' సేల్‌ను తీసుకొచ్చింది. ఈ సేల్ ద్వారా కెమెరాలు, హెడ్‌ఫోన్‌లు, స్పీకర్లు, ఇతర గాడ్జెట్‌లపై డీల్‌లు, ఆఫర్‌లను అందిస్తోంది. 'హోలీ షాపింగ్ స్టోర్' సేల్‌లో కస్టమర్స్ గాడ్జెట్‌లపై 60% వరకు తగ్గింపు పొందవచ్చని కంపెనీ పేర్కొంది. కంపెనీ HDFC కార్డ్‌లపై EMIని అతి తక్కువ ధరకు అందిస్తోంది.

హెడ్‌ఫోన్‌లు

నాయిస్ బడ్స్ VS103: ఒక చార్జ్‌పై 4.5 గంటల ప్లేటైమ్‌ను, 13.5 గంటల పాటు చార్జింగ్ కేస్‌తో మొత్తం 18 గంటల ప్లేటైమ్‌ను అందిస్తోంది. దీని హైపర్ సింక్ టెక్నాలజీ సిగ్నేచర్ నాయిస్‌తో వెంటనే ఫోన్‌కు కనెక్ట్ అవుతుంది. ధర రూ.1,499.

boAt Airdopes 441 : IWP (Insta Wake N' పెయిర్) సాంకేతికతతో పనిచేస్తుంది. బ్లూటూత్ v5.0తో వస్తుంది. నీరు, చెమటకు నిరోధకత కోసం IPX7 రేట్‌ను కలిగిఉంది. ధర రూ.1,999.

స్పీకర్లు

JBL Go 2: కొత్త IPX7 వాటర్‌ప్రూఫ్ డిజైన్‌తో స్ప్లాష్‌ను అందజేస్తుంది. క్రిస్టల్ క్లియర్ ఫోన్ కాల్ అనుభవాన్ని కూడా అందిస్తుంది. ధర రూ. 2,184.

boAt Stone Grenade: 5W ఆడియోతో, ఎక్కువ కాలం పాటు ఉండే లిథియం బ్యాటరీ ఒకేసారి 7 గంటల వరకు ప్లే టైం అందిస్తోంది. ధర రూ.1,499.

బోట్ స్టోన్ మార్వెల్ ఎడిషన్ : IPX7 మార్క్ షీల్డ్‌తో వస్తుంది. స్పీకర్ TWS ఫీచర్‌ని కలిగి ఉంది. ధర రూ.1,299.

స్మార్ట్‌వాచ్‌లు

boAt Xtend స్మార్ట్‌వాచ్: 1.69 అంగుళాల కలర్ LCD డిస్‌ప్లే రౌండ్ డయల్‌తో పూర్తి కెపాసిటివ్ టచ్ అనుభవాన్ని కలిగి ఉంటుంది. ధర రూ. 2,999.

Noise ColorFit Pulse Grand : 24x7 హార్ట్‌బిట్ రేటు, ఒత్తిడి, రక్త ఆక్సిజన్, నిద్ర మానిటర్, ఋతు చక్రం ట్రాకింగ్ ఫీచర్‌తో వస్తుంది. ధర రూ. 2,699.

Tags:    

Similar News