వనం నుంచి జనంలోకి పగిడిద్దరాజు

కేరింతలు నృత్యాలు శివసత్తుల ఆనందాల మధ్య పగిడిద్దరాజు వనం నుంచి జనం‌లోకి వచ్చారు. గుండాల మండలంలోని యాపలగడ్డ గ్రామంలో ప్రతి ఏటా అర్యం వంశికులు సమ్మక్క సారలమ్మ భర్త అయినా పగిడిద్దరాజు జాతరను ఘనంగా నిర్వహిస్తారు.

Update: 2023-03-02 07:16 GMT

దిశ, గుండాల: కేరింతలు నృత్యాలు శివసత్తుల ఆనందాల మధ్య పగిడిద్దరాజు వనం నుంచి జనం‌లోకి వచ్చారు. గుండాల మండలంలోని యాపలగడ్డ గ్రామంలో ప్రతి ఏటా అర్యం వంశికులు సమ్మక్క సారలమ్మ భర్త అయినా పగిడిద్దరాజు జాతరను ఘనంగా నిర్వహిస్తారు. ఈనెల ఒకటి నుంచి నాలుగు వరకు జరిగే జాతరలో ఒకటో తేదీ రాత్రి దేవత గద్దెలకు చేరగా రెండో రోజు గురువారం నాడు వనం నుండి దేవుడు పగిడిద్దరాజు గద్దెలకు చేరుకున్నారు. వనం నుంచి గద్దెలకు చేరే సందర్భంగా మూడు కిలోమీటర్ల దూరం గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో దేవతకు స్వాగతం పలికారు.

ఈ రోజు నుండి పగిడిద్దరాజు జాతర గుండాల మండలం యాపల గడ్డ నందు ఘనంగా నిర్వహించనున్నారు. అర్రే వంశీకులు ఈ జాతరను నిర్వహిస్తారు. సమ్మక్క భర్త అయినా పగిడిద్దరాజు స్వస్థలం గుండాల మండలం యాపలగడ్డ. ఈ జాతరకు మండలంతో పాటు వివిధ మండలాల నుంచి సుమారు పదివేల మంది భక్తులు హాజరై మొక్కలు సమర్పించుకుంటారు. ఈ జాతరను పినపాక నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, తుళ్లూరు బ్రహ్మయ్య, అర్యం లచ్చు పటేల్ సందర్శించి దేవతకు మొక్కులు సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రజలు భక్తులు పాల్గొన్నారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ కిన్నెర రాజశేఖర్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News