ప్రశాంత వాతావరణంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ : వరంగల్ ఏసీపీ

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని నగర

Update: 2023-12-31 14:02 GMT

దిశ,వరంగల్ టౌన్ : న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని నగర ప్రజలకు వరంగల్ ఏసీపీ బోనాల కిషన్ సూచించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ రాత్రి 12.30 గంటల వరకే నిర్వహించుకోవాలని పేర్కొన్నారు. డీజేలు, మ్యూజిక్ సిస్టమ్స్ , టపాసులు కాల్చడానికి ఎలాంటి అనుమతులు లేవని వివరించారు.ఈ వేడుకలతో ఇతరులకు ఇబ్బధులు కలగకుండా చూసుకోవాలని అన్నారు. మద్యం సేవించి రోడ్లమీద వాహనాలు నడిపితే జరిమానా తో పాటు జైలు శిక్ష పడుతుందని, అలాగే ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

మైనర్ పిల్లలకు వాహనాలు నడపడానికి ఇవ్వకూడదని, ఇస్తే సంబదిత వ్యక్తులపై కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు.న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పెట్రోలింగ్ నిర్వహించడం తో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తారని గుర్తు చేశారు. మద్యం తాగి రోడ్లపై కేకులు కట్ చేయడం వంటివి చేయరాదని,ఎవరైనా పోలీసుల నిబంధనలు అతిక్రమించి వేడుకలు నిర్వహిస్తే 100 నంబర్ కి సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

Read More..

పోలీస్ శాఖ కీలక నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్‌ల బదిలీ..

Tags:    

Similar News