‘దిశ’ ఎఫెక్ట్.. స్పందించిన ఇరిగేషన్ అధికారులు..

కలగానే మిగిలిన మినీ ట్యాంక్ బండ్,తొర్రూరులో నిలిచిపోయిన

Update: 2024-05-17 11:41 GMT

దిశ, తొర్రూరు: కలగానే మిగిలిన మినీ ట్యాంక్ బండ్,తొర్రూరులో నిలిచిపోయిన సుందరీకరణ పనులు,2018-19లో రూ.3.60కోట్లు మంజూరు చేశారు.రూ.2.19 కోట్లతో వంతెన దిమ్మెల నిర్మాణం చేశారు.మిగిలిన పనుల పూర్తిపై ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారు.ఇప్పటి వరకు చేపట్టని ఆనకట్ట, మత్తడి మరమ్మతులు.పంటపొలాలకు పొంచి ఉన్న ప్రమాదం.ఆందోళనలో ఆయకట్టు రైతులు.అనే శీర్షిక శుక్రవారం దిశ దినపత్రికలో ప్రచురించగా అట్టి కథనానికి ఇరిగేషన్ అధికారులు స్పందించి తొర్రూర్ పెద్ద చెరువును సందర్శించారు.ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ సిఈ అశోక్ కుమార్, ఇరిగేషన్ ఎస్ఇ సుధీర్, ఇరిగేషన్ ఈఈ రమేష్ బాబు, తదితరులు సందర్శించారు.

వచ్చారు.. వెళ్ళారు

ఇరిగేషన్ అధికారులు వచ్చారు..వెళ్ళారు అన్న మాదిరిగా తూతూ మంత్రంగా తనిఖీలు చేపట్టారు.తొర్రూరు పెద్ద చెరువుకు గండి ప‌డే ముప్పు పొంచి ఉన్న... ఇరిగేషన్ అధికారులు మాత్రం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. అనాతి కాలంలో పూర్తి చేయాల్సిన పనులు ఐదు సంవత్సరాలు గడుస్తున్న ఏ ఒక్క పని పూర్తి చేయడంలో విఫలమైందని ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయి. గత ఏడాది చెరువు ఆయకట్టు గండిపడి రైతులకు నష్టం కలిగింది. ఈ ఏడాది కూడా చెరువు ఆయకట్టు ఏ ఒక్క పని మొదలు పెట్టకపోవడంతో ఆయకట్టు సగానికి చీలిపోయి ఆయకట్టు గండి పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఇదంతా తెలిసిన ఇరిగేషన్ అధికారులు మాత్రం కాంట్రాక్టర్ పై ఎటువంటి ఒత్తిడి లేకుండా గాలికి వదిలేస్తున్నారు. పెద్ద చెరువు సుందరీకరణలో భాగంగా బ్రిడ్జి నిర్మించాల్సిన పనులు ఉండగా..ఒక దిమ్మలు మాత్రమే పోసి వదిలేశారు.

దిమ్మలు నిరుపయోగంగా మారడంతో..సుందరీకరణ పనులకు అడ్డుకట్ట పడింది. బ్రిడ్జి పోస్తేనే సుందరీకరణ పనులు మొదలు చేస్తామని ఆయ శాఖకు సంబంధించిన అధికారులు తెలుపుతున్నారు. మొత్తానికి తోరూర్ పెద్ద చెరువు మొత్తానికి తోరూర్ పెద్ద చెరువు ప్రమాదంలో ఉన్న ఇరిగేషన్ అధికారులు మాత్రం పనులు నత్త నడకగా సాగిస్తున్నారు.తొరూరు పెద్ద చెరువు ఆయకట్ట పనులు ఇరిగేషన్ అధికారులు మాత్రం పనులు నత్త నడకగా సాగిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు వెంటనే తొరూరు పెద్ద చెరువు ఆయకట్ట పనులు పూర్తిచేయాలని త్వరగా పూర్తి చేయాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కాంట్రాక్టర్ తో ఎలాగైనా పనులు చేపిస్తాం : అశోక్ కుమార్ ఇరిగేషన్ సీఈ

తొర్రూర్ పెద్ద చెరువు సంబంధించిన ఆయకట్ట,బ్రిడ్జి పనులు ఒక వారం రోజుల్లో మొదలు పెడతాం. కాంట్రాక్టర్ కు నోటీసులు పంపించాము. అతను కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. నేను ఈ పరిధిలోకి వచ్చి రెండు రోజులు మాత్రమే అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కాంట్రాక్టర్ ను పిలిపించి. ఆయకట్ట పనులు బ్రిడ్జి పనులు త్వరగా పూర్తిచేసే విధంగా చూసుకుంటాం... రైతులకు ఎటువంటి అపాయాలు కలగకుండా పనులు చేపడతాం..


Similar News