మేడారం జాతర.. శుభవార్త చెప్పిన ఆర్టీసీ

Update: 2022-01-24 13:23 GMT

దిశ, ఆత్మకూర్: ఆసియా ఖండంలోనే అతిపెద్దైన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఫిబ్రవరి 13వ తేదీ నుండి 19వ తేదీ వరకు జరుగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ జాతర పనులను జిల్లా అధికార యంత్రాంగం శరవేగంగా పూర్తి చేస్తున్నది. ఈ నేపథ్యంలో జాతరకు వచ్చే భక్తుల కోసం ఆత్మకూర్ మండల కేంద్రం నుండి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ మహేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆత్మకూరు మండల పరిధిలోని గ్రామాల్లోని 30 మంది ప్రయాణికులు ఒక బ్యాచ్‌గా ఏర్పడి జాతరకు వెళ్లాలనుకుంటే 9701577945 ఫోన్ చేస్తే వారికోసం ప్రత్యేకంగా బస్సును పంపిస్తామని తెలిపారు. ఆర్టీసీ బస్సులు సమ్మక్క-సారలమ్మ గద్దెల వరకు వెళ్తాయని, బస్సు ప్రయాణం సురక్షితమని అన్నారు. ప్రైవేటు వాహనాలు సమ్మక్క-సారలమ్మ గద్దెలకు రెండు కిలోమీటర్ల దూరంలో నిలిపేస్తారని, హన్మకొండ బస్టాండ్ నుంచి ఉదయం 6 గంటల నుంచి ప్రతీ అరగంటకో బస్సు మేడారానికి ప్రత్యేకంగా నడపబడుతున్నాయని, ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలన్నారు.

Tags:    

Similar News