ఏ కార్యకర్తకు ఆపద వచ్చిన 24 గంటలు అందుబాటులో ఉంటా...ఎర్రబెల్లి స్వర్ణ

జిల్లాలో నిర్వహించిన అభినందన సమావేశం, కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఎర్రబెల్లి స్వర్ణ మాట్లాడుతూ గత పదిసంవత్సరాలుగా కాంగ్రెస్ ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నదని అయినా చెక్కుచెదరని ధైర్యంతో కార్యకర్తలను కాపాడుకుంటూ వస్తున్నామని తెలిపారు.

Update: 2023-05-31 15:51 GMT

దిశ, హనుమకొండ టౌన్ : జిల్లాలో నిర్వహించిన అభినందన సమావేశం, కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఎర్రబెల్లి స్వర్ణ మాట్లాడుతూ గత పదిసంవత్సరాలుగా కాంగ్రెస్ ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నదని అయినా చెక్కుచెదరని ధైర్యంతో కార్యకర్తలను కాపాడుకుంటూ వస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో జిల్లాలోని నాయకులు దొంతి మాధవరెడ్డి, జంగా రాఘవరెడ్డి లాంటి పెద్ద నేతల అండ మరువలేనిదని ఈ సందర్భంగా ఊటంకించారు. జిల్లాలో ఏమూలకున్న కార్యకర్తకు ఆపద వచ్చినా కూడా అక్క అని చెప్పి పిలిస్తే 24 గంటల్లో అందుబాటులో ఉంటానని తెలిపారు. జిల్లాలోని నాయకుల సహకారంతో కాంగ్రెస్ పార్టీని విజయపథంలో నడిపించి విజయం సాధిస్తానని ధీమావ్యక్తం చేశారు.

మా ఇంటి తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయి..

కార్యకర్తలు ధైర్యంగా ఉండి పార్టీ కోసం పాటుపడే కార్యకర్తల కోసం మా ఇంటి తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని ఎల్లప్పుడూ వారిని ఆదుకుంటానని ఈ సందర్భంగా తెలిపారు. ఒకవేళ నేను అందుబాటులో లేనిపక్షంలో వరదరాజేశ్వరరావును కార్యకర్తల వద్దకు పంపిస్తానని తెలిపారు. చచ్చేవరకు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈనాటి రాష్ట్రపరిస్థితి చూస్తే బీఆర్ఎస్ పార్టీ కారణంగా రాష్ట్రం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయి ఉన్నదని అన్నారు. ఈ అవినీతిని బాగు చేయడం ఎవరి తరం కాదు అని అన్నారు. బీఆర్ఎస్ నాయకుల అవినీతి భాగవతాలు భూ కబ్జాలకు అంతే లేకుండా పోయిందని ఖాళీ జాగా కనబడితే కబ్జా చేసేస్తున్నారని, ఈ సందర్భంగా తెలిపారు. కులాల మధ్య కుంపట్లు పెట్టి రాష్ట్రంలో చిచ్చు రగిలించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కులాల పేరు చెప్పి రాష్ట్రాన్ని దేశాన్ని నాశనం చేస్తున్నారని అన్నారు.

నాకు ప్రజల కష్టాలు తెలుసు మేయర్ గా గడప గడపకు వెళ్లి వారి తో పంచుకున్నాను...

తాను జిల్లాలో మేయర్ గా పనిచేసిన కాలంలో ప్రతి గడపగడపకు వెళ్లి ప్రతిరోజు వారి కష్టాలను తెలుసుకున్నానని అన్నారు. నేడు ఉన్న కాంగ్రెసులో కులాల కుంపట్లు లేవని, తమలో ఎటువంటి భేద భావం లేకుండా, అందరం కలిసి పోయామని, అందరం ఐక్యతతో పార్టీ విజయానికి పాటుపడతామని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ వల్లే తెలంగాణాను వారే ఏదో.. తెచ్చినామని, ఉత్సవాలు చేస్తామని అంటున్నారు. ఏ ఉత్సవాలు చేసినా మేము తెలంగాణా ఇస్తేనే కదా వాళ్ళు ఉత్సవాలు చేసేది. ఇచ్చినవాళ్లు మేమేం చేయాలి అని ప్రశ్నించారు.? కాంగ్రెస్ శ్రేణులన్నీ ఒక సమగ్ర ప్రణాళికతో మనం కూడా ఉత్సవాలు చేద్దాం. దీనికోసం అందరం ఐక్యమవుదామని చెప్పి పిలుపునిచ్చారు.

చిన్న గలాటాలు కేవలం ఇంటి పంచాయతీలు మాత్రమే : జంగా

జంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ కాసేపటి క్రిందనే మీడియా ముందు.. చిన్న గలాట జరిగిందని ఇటువంటి గలాటాలు ఇంటి పంచాయతీలు అనిచెప్పి ఇటువంటి వాటితో భయపడేది లేదు అన్నారు. ఇంటి పంచాయతీలు పక్కకు పెట్టాలి ప్రస్తుతం బలమున్న పార్టీ ప్రజలను దోచుకుంటున్న పార్టీ తెలంగాణ మనోళ్లను దోచుకుంటున్న పార్టీ తెలంగాణ పేరు చెప్పుకొని సొమ్ము దోచుకుంటున్న పార్టీ సామాన్య ప్రజలను 80% అనగా తొక్కుతున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. ప్రజలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తేవాలని దినికోసం అందరూ కృషి చేయాలని అన్నారు. ఏమైనా గొడవలు ఉంటే అవి ఇంటి వరకే పరిమితం కావాలి కానీ ఇలా అందరి ముందు బహిర్గతం కావద్దని కార్యకర్తలకు మనవి చేస్తున్నాను అన్నారు.

ఈ రోజు ఒక జిల్లా అధ్యక్షురాలు అంటే వారి మీద మూడు నియోజకవర్గాలు కింద ఉన్న అనేక మండలాలను గెలిపించే బాధ్యత నాయకుల మీద ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన బాధ్యతలు ప్రతిఒక్కరూ క్రమశిక్షణతో నిర్వర్తించి పార్టీ గెలుపునకు పాటుపడాలని కోరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు తాటికొండ రాజయ్య, ఎలిమినేటి మాధవరెడ్డి, ఇనుగాల వెంకటరామిరెడ్డి, జంగా రాఘవరెడ్డి, నమిండ్ల శ్రీనివాస్ జిల్లాలోని యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.

Tags:    

Similar News